అమరావతి : ఏపీలో మద్యం షాపుల(Liquor Shops) ఏర్పాటుపై రెండురోజుల్లో మార్గదర్శకాలు (Guide Lines) జారీ చేయనున్నామని ఏపీ ఆబ్కారీశాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) పేర్కొన్నారు. గత టీడీపీ (TDP) హయాంలో మాదిరిగానే ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేట్ షాప్స్ నిర్వహణ జరిగేలా నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
ఏ జిల్లాలో ఎన్ని షాపులు అనే వివరాలు వెల్లడిస్తామని, 7 రోజుల పాటు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. సెలవుల మధ్యలో రెండురోజుల పాటు సెలవులు వస్తున్నాయని తెలిపారు. పదో రోజున డ్రా తీస్తామని వివరించారు. దసరా పండుగకు ముందే మద్యం షాపులు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు.
ఒక్కో దరఖాస్తుకు రూ. 2 లక్షల ఫీజుగా నిర్ణయించామని, ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులనైనా వేయవచ్చన్నారు. మద్యం ప్రియులకు అన్ని రకాల బ్రాండ్లు అందే విధంగా పారదర్శకంగా అందిస్తున్నామని తెలిపారు. రూ. 99 రూపాయలకే నాణ్యమైన మద్యాన్ని సామాన్యులకు అందిస్తామని వెల్లడించారు.