LPG cylinder | ధరల మోతతో ఇబ్బంది పడుతున్న గ్యాస్ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు (Oil Marketing Companies) మరోసారి షాక్ ఇచ్చాయి. వాణిజ్య అవసరాలకు (Commercial LPG cylinder) వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధరను పెంచాయి. 19 కేజీల సిలిండర్‌పై ఏకంగా రూ.48.50 మేర పెరిగింది. ఈ మేరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం ఉదయం ప్రకటించాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అంటే అక్టోబర్ 1 నుంచే అమల్లోకి రానున్నట్లు వెల్లడించాయి.
ధరల పెంపు తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,691 నుంచి రూ.1740కి పెరిగింది. కోల్‌కతాలో రూ.1,802 నుంచి రూ.1,850.50కి, ముంబైలో రూ.1,644 నుంచి రూ.1,692.50కి, చెన్నైలో రూ.1,855 నుంచి రూ.1,903కి పెరిగాయి. స్థానిక పన్నుల ఆధారంగా రాష్ట్రాలను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి. కాగా అంతకుముందు సెప్టెంబర్ 1, ఆగస్టు 1న కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను కంపెనీలు పెంచాయి.
ఇక 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదని, పాత ధరలే యథాతథంగా కొనసాగుతాయని చమురు కంపెనీలు స్పష్టం చేశాయి. ప్రతి నెల 1వ తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలను సవరిస్తుంటాయి. అందులో భాగంగా ఇవాళ కూడా సవరించిన ధరలను ప్రకటించాయి.
Also Read..
Assembly Elections | జమ్ముకశ్మీర్‌లో చివరి విడత ఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్
Young Team of Fab- 4 | దూకుడే మంత్రగా దూసుకొస్తున్న కుర్రాళ్లు.. నయా ఫ్యాబ్- 4 అవుతారా..?
Congress Govt | హైకోర్టు తీర్పు.. చెడగొట్టు సర్కార్‌కు చెంపపెట్టు