Rajinikanth | సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ ఆరోగ్యంపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (CM Stalin) సైతం రజనీ త్వరగా కోలుకోవాలని (speed recoery) ఆకాంక్షించారు. ‘ఆసుపత్రిలో చేరిన నా స్నేహితుడు రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. అదే సమయంలో, ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి కూడా నటుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
மருத்துவமனையில் அனுமதிக்கப்பட்டுள்ள நண்பர் சூப்பர்ஸ்டார் திரு. @rajinikanth அவர்கள் விரைந்து நலம் பெற விழைகிறேன்.
— M.K.Stalin (@mkstalin) October 1, 2024
రజనీకాంత్ తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని అపోలో దవాఖానకు తరలించారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీశ్ ఆధ్వర్యంలోని ప్రత్యేక వైద్యుల బృందం సూపర్‌స్టార్‌కు చికిత్స అందిస్తున్నదని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నదని వైద్యులు తెలిపారు.
కాగా, గతంలో కూడా రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 2020 డిసెంబర్లో హైదరాబాద్‌లో ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్న సూపర్‌స్టార్.. రక్తపోటులో తీవ్ర హెచ్చుతగ్గులు రావడంతో జూబ్లీహిల్స్ అపోలో దవాఖానలో చేరారు. ప్రత్యేక ఐసీయూకు తరలించి రక్తపోటులో హెచ్చుతగ్గులను నియంత్రించారు.
Also Read..
LPG cylinder | వినియోగదారులకు షాక్.. పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర
Govinda | బాలీవుడ్ నటుడు గోవిందా ఇంట్లో గన్ మిస్‌ఫైర్.. కాలులోకి దూసుకెళ్లిన బుల్లెట్
MLC Kavitha | హాస్పిటల్ చేరిన ఎమ్మెల్సీ కవిత..