Lamborghini | లాంబోర్గిని (Lamborghini).. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇటలీకి చెందిన సూపర్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆటోమోబిలి లాంబోర్గిని కారును కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ కలలు కంటుంటారు. అయితే, అది అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఈ విలాసవంతమైన లగ్జరీ కారు ధర రూ.కోట్లల్లో ఉంటుంది. అందుకే జస్ట్ దాన్ని దగ్గరనుంచి చూసి ఆస్వాదిస్తుంటారు జనాలు. తాజాగా ఓ ట్రాఫిక్ పోలీస్ (traffic police) సైతం అదే చేశాడు.
నిశాంత్ సబూ (Nishant Saboo) అనే ఓ వ్యాపారవేత్త తన లాంబోర్గిని కారులో రయ్రయ్ మంటూ దూసుకెళ్తున్నారు. ఇంతలో ఒకచోట ట్రాఫిక్ పోలీసులు అతని కారును ఆపారు. దీంతో అతను ఎందుకు ఆపారా అని ఒక్కసారిగా టెన్షన్ పడ్డాడు. కారు వద్దకు వచ్చిన ట్రాఫిక్ కాప్.. చెక్చేశాడు. అన్ని పత్రాలు ఉన్నాయని, చలాన్లు ఏమీ లేవని ధ్రువీకరించారు. అనంతరం నిశాంత్‌ను ఆ ట్రాఫిక్ పోలీసు ఓ కోరిక కోరాడు. లాంబోతో ఫొటోలు తీసుకునేందుకు అనుమతి కోరాడు. కార్లో కూర్చొని ఎంతో సరదాగా ఫొటోలు దిగాడు. ఇందుకు సంబంధించిన చిన్న వీడియోను నిశాంత్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ‘పోలీసులు కూడా సూపర్ కార్ల పట్ల మక్కువ కలిగి ఉండటం చాలా గొప్ప విషయం’ అని వీడియోకి క్యాప్షన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Also Read..
Dera Baba | హర్యానా ఎన్నికల వేళ.. డేరా బాబాకు మరోసారి పెరోల్
Govinda | బాలీవుడ్ నటుడు గోవిందా ఇంట్లో గన్ మిస్‌ఫైర్.. కాలులోకి దూసుకెళ్లిన బుల్లెట్