Delivery Agent | ఐఫోన్ (iPhone) డెలివరీ చేసేందుకు వెళ్లిన ఓ డెలివరీ ఏజెంట్ (Delivery Agent) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో (Lucknow)లో వెలుగుచూసింది. ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని చిన్హాట్ ప్రాంతానికి చెందిన గజానన్ అనే వ్యక్తి ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ.1.5 లక్షల విలువైన ఐఫోన్‌ను ఆర్డర్ పెట్టాడు. క్యాష్ ఆన్ డెలివరీ (Cash On Delivery) ఆప్షన్ ఎంచుకున్నాడు. గత నెల 23న నిషాత్‌గంజ్ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల భరత్ సాహు అనే డెలివరీ ఏజెంట్ ఫోన్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్లాడు. అక్కడ గజానన్.. సాహుని గొంతు నులిమి అంతమొందించాడు. అతడికి తన స్నేహితుడు ఆకాశ్ కూడా సాయపడ్డాడు. అనంతరం సాహు డెడ్ బాడీని గోనె సంచిలో కుక్కి సమీపంలోని ఇందిరా కెనాల్లో పడేశారు.
అయితే రెండు రోజులైనా సాహు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. గత నెల 25వ తేదీన స్థానిక పోలీసులను సంప్రదించారు. మిస్సింగ్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాహు కోసం గాలింపు చేపట్టారు. సాహు కాల్ డేటా, ఫోన్ లొకేషన్‌ను ట్రేస్ చేయగా.. గజానన్‌కు చివరిసారిగా ఫోన్ చేసినట్టు తేలింది. దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శశాంక్ సింగ్ వెల్లడించారు. గజానన్, అతడి స్నేహితుడు ఆకాశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. వారు నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. కాలువలో సాహు మృతదేహం కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందం గాలిస్తున్నట్లు వివరించారు.
Also Read..
Rajinikanth | నా స్నేహితుడు త్వరగా కోలుకోవాలి.. రజనీకాంత్ ఆరోగ్యంపై సీఎం స్టాలిన్
LPG cylinder | వినియోగదారులకు షాక్.. పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర
Govinda | బాలీవుడ్ నటుడు గోవిందా ఇంట్లో గన్ మిస్‌ఫైర్.. కాలులోకి దూసుకెళ్లిన బుల్లెట్