(Desmond tutu) జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన ప్రముఖ్య ఉద్యమకారుడు ఆర్చ్ బిషప్ డెస్మండ్ టుటు (90) కన్నుమూశారు. నోబెల్ శాంతి బహుమతి పొందిన ఉద్యమ కార్యకర్తగా లబ్ధిప్రతిష్ఠులు. డెస్మండ్ టుటు మరణించినట్లు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ఆదివారం ప్రకటించారు. ‘టుటు మరణం దక్షిణాఫ్రికాకు తీరని లోటు’ అని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామాఫోసా తన సంతాప సందేశంలో తెలిపారు. వర్ణవివక్షకు రాజీపడని అజాత శత్రువుగా పేరుగడించారు. మెజార్టీ నల్లజాతి ప్రజలపై క్రూరమైన అణచివేత పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపారు.
ప్రపంచవ్యాప్తంగా జాతి అసమానతలకు వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయాలను తెలిపేందుకు తరచుగా బహిరంగ ప్రదర్శనలు నిర్వహించేవారు. టుటు 1997లో ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయింది. 2015 నుంచి చాలాసార్లు దవాఖానలో చేరారు. భార్యతో కలిసి కేప్ టౌన్ ఆవల రిటైర్మెంట్ కమ్యూనిటీలో నివసిస్తున్నారు.
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..