Earthquake | అఫ్ఘానిస్థాన్ (Afghanistan)ను వరుస భూకంపాలు (Earthquake) వణికిస్తున్నాయి. తాజాగా మరోసారి అక్కడ భూమి కంపించింది. గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది. భూమికి 140 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు పేర్కొంది. అయితే, ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు. కాగా, అఫ్ఘాన్‌లో పది రోజుల్లో భూకంపం సంభవించడం ఇది మూడోసారి కావడం గమనార్హం.
కాగా, ఈ నెల 4వ తేదీన అఫ్ఘాన్‌ను అత్యంత శక్తిమంతమైన భూకంపం వణికించిన విషయం తెలిసిందే. 6.3తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం ధాటికి 27 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 1,000 మంది గాయపడ్డారు. ఈ విపత్తులో దేశంలోనే అత్యంత అందమైన మసీదుల్లో ఒకటి తీవ్రంగా దెబ్బతిన్నట్లు తాలిబన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి షరాఫత్ జమాన్ అమర్ తెలిపారు. ఆ తర్వాత నవంబర్ 8వ తేదీన కూడా భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై 4.4 తీవ్రతతో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇలా వరుస భూకంపాలతో అఫ్ఘాన్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. అఫ్ఘానిస్థాన్ హిందూ కుష్ ప్రాంతంలో ఉన్నందున, భారతీయ-యూరేషియన్ పలకల సంధి కారణంగా అక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తాయి నిపుణులు వెల్లడించారు.
Also Read..
US Shutdown | అమెరికాలో ముగిసిన షట్‌డౌన్.. ఫండింగ్ బిల్లుపై ట్రంప్ సంతకం
OPT | ఓపీటీ రద్దు?.. అంతర్జాతీయ విద్యార్థులకు ట్రంప్ మరో షాక్!
Donald Trump | లైంగిక బాధితురాలితో గంటల తరబడి ట్రంప్!