బీజింగ్: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా జోక్యంపై చైనా మండిపడింది. బలప్రయోగం చేయవద్దని వార్నింగ్ ఇచ్చింది. (China warns) ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైనిక దాడులకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మద్దతు ఇచ్చారు. అలాగే రాజీకి రావాలని ఇరాన్‌ను ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో చైనా స్పందించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్ మీడియాతో మాట్లాడారు. అమెరికా ద్వారా జరిగే ఏదైనా బలప్రయోగం ఇరాన్ సార్వభౌమాధికారం, భద్రతను ఉల్లంఘించినట్లుగా పరిగణిస్తామని తెలిపారు. ‘ఇతర దేశాల సార్వభౌమాధికారం, భద్రత, ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించే అంతర్జాతీయ సంబంధాలతో కూడిన బలప్రయోగం లేదా ముప్పును కలిగించే ఏ చర్యనైనా చైనా వ్యతిరేకిస్తుంది’ అని అన్నారు.
కాగా, ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైనిక దాడులపై చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కజకిస్తాన్‌లో ఐదు మధ్య ఆసియా దేశాలతో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని వర్గాలు అత్యవసరంగా ఉద్రిక్తతలు తగ్గించాలని, పరిస్థితి మరింత దిగజారకుండా నిరోధించడానికి కృషి చేయాలి పిలుపునిచ్చారు. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడంలో నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి చైనా సిద్ధంగా ఉందన్నారు.
Also Read:
Watch: కేదార్నాథ్ యాత్రికుల మధ్య తీవ్ర ఘర్షణ.. కర్రలతో కొట్టుకున్న వీడియో వైరల్