డెహ్రాడూన్: కేదార్నాథ్ యాత్రికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. (Kedarnath Pilgrims Brawl) దీంతో కర్రలతో ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు జోక్యం చేసుకుని వారిని చెదరగొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరాఖండ్‌లోని సోన్‌ప్రయాగ్‌లో ఈ సంఘటన జరిగింది. కేదార్నాథ్ యాత్ర మార్గంలో పర్యాటకుల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఈ యాత్రలో కీలక జంక్షన్ అయిన సోన్ప్రయాగ్లోని పార్కింగ్ ప్రాంతంలో కొందరు యాత్రికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో పలువురు వ్యక్తులు కర్రలతో కొట్టుకున్నారు.
కాగా, స్థానిక అధికారులు వెంటనే స్పందించారు. కొట్టుకుంటున్న వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా లాఠీఛార్జ్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Video: Sticks In Hand, All-Out Brawl Among Kedarnath Pilgrims pic.twitter.com/F8ipViJMP5
— NDTV (@ndtv) June 19, 2025
Also Read:
Calf Born With 2 Heads | రెండు తలలు, మూడు కళ్ళతో జన్మించిన దూడ.. చూసేందుకు ఎగబడిన జనం