Gaza | గాజా (Gaza) స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ (Israel) భీకర దాడులకు కొనసాగిస్తోంది. హమాస్ (Hamas) అంతమే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఐడీఎఫ్ దాడుల్లో వందలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా గాజాపై ఐడీఎఫ్ దళాలు భీకర దాడులకు పాల్పడ్డారు. మంగళవారం తెల్లవారుజామున నుంచి గాజా అంతటా ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో పదుల సంఖ్యలో పాలస్తీనియన్లు మరణించారు. దాదాపు 62 మంది మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ దాడులను పాలస్తీనా గ్రూప్ హమాస్ ఖండించింది. పౌరులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఆరోపించింది. ఇలాంటి చర్యలు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడిందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. మొత్తం 72 పేజీల నివేదికను విడుదల చేసింది.
హమాస్, ఇజ్రాయెల్ దాడులు (Israel Hamas War) రెండేండ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. 2023, అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దుల్లోని హమాస్ దాడికి పాల్పడింది. దీంతో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు. మరో 251 మందిని బందీలుగా హమాస్ పట్టుకెళ్లింది. ప్రతిగా గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతున్నది. హమాస్ తుదముట్టించే వరకు గాజాపై దాడులు చేస్తామంటూ ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇందులో భాగంగా గాజా స్ట్రిప్‌పై భీకర దాడులు చేపడుతోంది. ఇక ఈ దాడుల్లో ఇప్పటివరకు 64 వేల మందికిపైగా పాలస్తీనియన్లు (Palestinians) మృతిచెందారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 65 వేల మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 400 మందికిపైగా ఆచూకీలేకుండా పోయారని తెలిపింది. మృతుల్లో సగానికిపైగా మహిళలు, చిన్నారులు ఉన్నారని పేర్కొంది.
Also Read..
Umer Shah: 15 ఏళ్ల పాకిస్థానీ టీవీ స్టార్ ఉమేర్ షా గుండెపోటుతో మృతి
Ozone Layer: కోలుకుంటున్న ఓజోన్ పొర .. గుడ్ న్యూస్ చెప్పిన ఐక్యరాజ్యసమితి