ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఎంటర్టైన్మెంట్ పరిశ్రమ తీవ్ర విషాదంలోకి వెళ్లింది. ఆ దేశానికి చెందిన టీవీ స్టార్, చైల్డ్ ఆర్టిస్ట్ ఉమేర్ షా( Umer Shah).. 15 ఏళ్ల వయసులోనే ప్రాణాలు కోల్పోయాడు. చిరునవ్వులు చిందిస్తూ.. అందమైన ముఖంతో ఆకట్టుకునే ఆ కుర్రాడు అకస్మాత్తుగా మృతిచెందాడు. కార్డియాక్ అరెస్టు వల్ల అతను ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు. స్వంత ఊరు దేరా ఇస్మైల్ ఖాన్‌లో ఆ పిల్లోడు చివరి శ్వాస విడిచాడు. ఉమేర్ షా తీవ్రంగా వాంతులు చేసుకున్నాడని, ఊపిరితిత్తుల్లోకి ద్రవాలు వెళ్లడంతో.. గుండెసంబంధిత వ్యాధితో ఆ టీనేజర్ మృతిచెందినట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో ఉమేర్ షా తన వీడియోలతో ఫేమస్ అయ్యాడు. టీవీ పర్సనాల్టీగా ఎదిగాడు. తన సోదరుడితో కలిసి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఏఆర్వై డిజిటల్స్, జీతో పాకిస్థాన్, షాన్ ఇ రంజాన్ లాంటి పాపులర్ షోలలోనూ ఉమేర్ దర్శనం ఇచ్చాడు. అందమైన కాస్ట్యూమ్స్ ధరించేవాడు. ఇక సోదరుడితో కలిసి కామిడీ వీడియోలను పోస్టు చేసేవాడు. పీచే తో దేకో అన్న రీల్‌తో ఆ పిల్లాడు చాలా ఫేమస్ అయ్యాడు.
పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ సెలబ్రిటీలు ఉమేర్ మృతి పట్ల సంతాపం తెలిపారు.