యువహీరో సుమంత్ ప్రభాస్ లీడ్‌రోల్ చేస్తున్న రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’. నిధి ప్రదీప్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సుభాష్‌చంద్ర దర్శకుడు. అభినవ్‌రావు నిర్మాత. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలో విడుదల కానున్నది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా రెండోపాటను శనివారం విడుదల చేశారు.
‘ఓ మై గాడ్’ అంటూ సాగే ఈ పాటను వెంగీ రాయగా, నాగవంశీకృష్ణ స్వరపరిచారు. గానాబాలా ఆలపించారు. అర్థంకాని అమ్మాయిల మనస్తత్వాన్ని ఆవిష్కరించేలా ఈ పాట సాగింది. విజయ్ పోలాకి ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. జగపతిబాబు, రాజీవ్ కనకాల, లైలా, దేవిప్రసాద్, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయి సంతోష్, నిర్మాణం: రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్.