Mass Shooting | థాయ్‌లాండ్ (Thailand)లో కాల్పుల ఘటన కలకలం (Mass Shooting) రేపింది. థాయ్ రాజధాని బ్యాంకాక్ (Bangkok)లోని రద్దీగా ఉండే ఓర్ టు కో మార్కెట్లో ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. మెట్రోపాలిటన్ పోలీస్ బ్యూరో డిప్యూటీ కమిషనర్ చరిన్ గోపట్టా తెలిపిన వివరాల ప్రకారం.. రద్దీగా ఉండే మార్కెట్లో దుండగుడు సోమవారం కాల్పులకు పాల్పడ్డాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో నలుగురు భద్రతా గార్డులు మరణించారు. ఓ మహిళ కూడా ప్రాణాలు కోల్పోయింది. మరొకరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
Operation Mahadev: ఆపరేషన్ మహాదేవ్.. కశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
Operation Sindoor | సిందూర్‌పై చర్చ.. అధికార, ప్రతిపక్షం నుంచి మాట్లాడేది వీళ్లే..