ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Jul 22, 2020 , 16:01:12

యూఏఈలో ‘ఈద్ అల్ అదా’ కు 4రోజుల సెల‌వులు

యూఏఈలో ‘ఈద్ అల్ అదా’ కు 4రోజుల సెల‌వులు

యూఏఈ :  యూఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ ‘ఈద్ అల్ అదా’కు బుధ‌వారం సెల‌వులు ఖరారు చేసింది. ప‌బ్లిక్ సెక్టార్స్‌కు నాలుగు రోజులు సెల‌వులు ఇస్తునట్లు యూఏఈ ప్రకటించింది. జూలై 30 నుంచి ఆగ‌స్టు 2 వ‌ర‌కు అధికారులు సెల‌వులు ఇచ్చారు. తిరిగి ఆగ‌స్టు 3న య‌ధావిధిగా విధుల‌కు హాజ‌రు కావాల‌ని సూచించారు.

ఇవే నిబంధ‌న‌లు ప్రైవేట్ సెక్టార్స్ కూడా వ‌ర్తిస్తాయ‌ని అధికారులు పేర్కొన్నారు. ఈ మేర‌కు యూఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ బుధ‌వారం ట్వీట్ చేసింది.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.logo