Singapore Airlines | సింగపూర్ ఎయిర్‌లైన్స్ (Singapore Airlines)కు చెందిన ఓ విమానంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విమానం గాల్లో ఉండగా తీవ్రమైన కుదుపులకు (Severe Turbulence) లోనైంది. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు మరణించగా.. సుమారు 30 మంది గాయపడ్డారు. లండన్ (London) నుంచి సింగపూర్ వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది.
సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777-300ER విమానం 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బందితో లండన్ నుంచి సింగపూర్‌కు బయల్దేరింది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం తీవ్ర కుదుపులకు లోనైనట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. తీవ్రమైన అల్లకల్లోలం కారణంగా విమానాన్ని బ్యాంకాక్‌కు (Bangkok) మళ్లించినట్లు వెల్లడించింది. సోమవారం మధ్యాహ్నం 3:45 గంటల సమయంలో (స్థానిక కాలమానం ప్రకారం) సువర్ణభూమి ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు పేర్కొంది.
ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు మరణించాడని, సుమారు 30 మంది గాయపడినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఈ మేరకు మృతి చెందిన బాధిత కుటుంబానికి సంతాపం ప్రకటించింది. అదేవిధంగా గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించే విషయంపై థాయ్‌లాండ్ అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.
A Singapore Airlines flight from London made an emergency landing in Bangkok on Tuesday due to severe turbulence, the airline said, with one passenger on board dead and injuries reported. The Boeing 777-300ER plane with 211 passengers and 18 crew was headed to Singapore when it… pic.twitter.com/UM0Vg4VCc2
— ANI (@ANI) May 21, 2024
Also Read..
Presidential Elections | జూన్ 28న ఇరాన్ అధ్యక్ష ఎన్నికలు
Arvind Kejriwal | ‘ఝాన్సీ కి రాణి’.. భార్యను ప్రొమోట్ చేస్తున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్