Arvind Kejriwal : జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్‌ను ఏ కోర్టు దోషిగా నిర్ధారించకపోయినా ఆయనను జైలులో ఎందుకు ఉంచారని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మోదీ సర్కార్‌ను నిలదీశారు. దర్యాప్తు జరుగుతున్న సమయంలో సొరెన్‌ను నిర్బంధించారని అన్నారు.
ఇది మోదీ గూండాగిరీ కాదా అని ప్రశ్నించారు. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో సోమవారం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ర్యాలీని ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడారు. తనకు వ్యతిరేకంగా ఏ కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోయినా తనను జైలుపాలు చేశారని మండిపడ్డారు.
రేపు మరొకరు ఎవరినైనా జైల్లో పెట్టవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. జార్ఖండ్‌లోని మొత్తం 14 స్ధానాలనూ విపక్ష ఇండియా కూటమి గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక జంషెడ్‌పూర్‌లో సభ ముగిసిన అనంతరం సభా స్ధలిలో ఏర్పాటు చేసిన డ్రమ్స్‌ను కేజ్రీవాల్ మోగించారు.
Read More :
PM Modi | పూరీ జగన్నాథుడు ప్రధాని మోదీకి భక్తుడట.. నోరు జారిన బీజేపీ అభ్యర్థి