హైదరాబాద్ : బంజారాహిల్స్ నంది నగర్లో విషాదం చోటు చేసుకుంది. స్ట్రీట్ ఫుడ్ తిని ఓ మహిళ మృతి (Woman dies)చెందగా, పలువురు అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నంది నగర్(Nandi Nagar) సమీపంలోని సింగాడకుంటలో వారం వారం అంగడి మార్కెట్లలో ఏర్పాటు చేసిన మామ్స్ కౌంటర్ వద్ద కొనుగోలు చేసిన మోమోస్(Momos) తిని రేష్మ(29) అనే మహిళ మృతి చెందింది. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులు వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. బంజారా హిల్స్ పోలీసులు ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.