BC Commission | నేడు ఆదిలాబాద్ జిల్లాలో బీసీ కమిషన్ పర్యటన
BC Commission | స్థానిక సంస్థల రిజర్వేషన్లపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం నేడు ఆదిలాబాద్ జిల్లాలో(Adilabad district) బీసీ కమిషన్(BC Commission) పర్యటించనున్నది. రిజర్వేషన్ల ఖరారుకు ప్రజల నుంచి అభ్యర్థనలు స్వీకరిస్తారు.
హైదరాబాద్ : స్థానిక సంస్థల రిజర్వేషన్లపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం నేడు ఆదిలాబాద్ జిల్లాలో(Adilabad district) బీసీ కమిషన్(BC Commission) పర్యటించనున్నది. రిజర్వేషన్ల ఖరారుకు ప్రజల నుంచి అభ్యర్థనలు స్వీకరిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు జిల్లాల నుంచి రాజకీయ పార్టీలు, బీసీ సంఘాల ప్రతినిధులు హాజరవుతారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా, వచ్చే నెల 13 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో బీసీ కమిషన్ బహిరంగ విచారణ చేపట్టనున్నది.
మరోవైపు న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా శాస్త్రీయపద్ధతిలో కులగణన నిర్వహించాలని, రిజర్వేషన్ల శాతాన్ని పెంచడంతోపాటు కులవృత్తుల ఆధునీకరణకు సైతం ఊతమివ్వాలని బీసీ కులసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లు, పారిశ్రామిక రంగంలో సబ్సిడీలు, భూముల కేటాయింపు, బీసీ సబ్‌ప్లాన్, బీసీ కులాల ఉత్పత్తులకు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రత్యేకమైన సెజ్‌లు, ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం వంటి అంశాలతోపాటు కులాల వారీగా సమస్యలను, వాటికి తాము సూచిస్తున్న పరిషార మార్గాలను అమలుచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ మేరకు నేటి నుంచి జిల్లాల్లో పర్యటించనున్న రాష్ట్ర బీసీ కమిషన్‌కు పెద్దఎత్తున వినతులు సమర్పించాలని కులసంఘాల ప్రతినిధులు పిలుపునిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

