హైదరాబాద్ : భర్త స్నానం చేస్తుండగా వీపు రుద్దమన్నందుకు భార్య భర్తను ఐరన్ రాడ్తో( Iron rod) కొట్టిన (Wife beat husband) సంఘటన కూకట్పల్లిలో(Kukatpally) చోటు చేసుకుంది. వివరాల్లోకి.. శివ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి కేపీహెచ్బీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. కాగా, ఆదివారం శివ స్నానం చేస్తుండగా తన వీపు రుద్దాలని భార్యపై గట్టిగా అరిచాడు. దీంతో అరవకండి చుట్టూ ఉన్నవాళ్లు వింటే బాగోదు అని భార్య చెప్పింది. అయినా శివ తగ్గకపోవడంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది.
దీంతో ఆవేశానికి గురైన అతడి భార్య పక్కనే ఉన్న రాడ్తో శివ తలపై బలంగా కొట్టింది. శివ తలకు తీవ్ర గాయం కావడంతో స్థానికులు ఓ ప్రైవేట్ హాస్పిటల్కు చికిత్స నిమిత్తం తరలించారు. తనపై దాడి చేసిన భార్యపై శివ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.