Bigg Boss Telugu 8 | బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఐదోవారం చివరిరోజుకి చేరుకుంది. గతవారం హౌజ్ నుంచి సోనియా ఆకులను బయటకు పంపిన బిగ్ బాస్ ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగానే మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యాడు. నిజానికి ఆదిత్య ఓం గురువారంమే ఎలిమినేట్ అయిన శనివారం వరకు హౌజ్‌లోనే ఉన్నాడు. ఇక డేంజర్ జోన్లో నైనికా, విష్ణుప్రియా, ఆదిత్య ఓం ఉండగా.. మెజారిటీ హౌస్మేట్స్ నిర్ణయం ప్రకారం ఆదిత్య ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేట్ అయిన తర్వాత చివరిసారిగా హౌస్‌మేట్స్‌ను కలవడానికి వచ్చాడు. ఆ తర్వాత బిగ్ బాస్ బజ్‌లో కూడా పాల్గొన్నాడు.
ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యి వెళ్లాడు కాబట్టి మళ్లీ కనిపించడు అనుకున్న హౌజ్‌మేట్స్‌కి కనిపించి షాక్ ఇచ్చాడు. నాగార్జునతో పాటు స్టేజ్‌పై కనిపించి అందరికి షాకిచ్చాడు. అయితే ఎవరికి హగ్ ఇవ్వాలి.. ఎవరికి పంచ్ ఇవ్వాలి అంటూ ఆదిత్యతో చివరి టాస్క్ ఆడించారు నాగ్. ఇందులో ఆదిత్య నబీల్, పృథ్వి, నిఖిల్, ప్రేరణ, విష్ణుప్రియాలను హగ్ ఇవ్వగా.. యష్మీ, మణికంఠ, నైనికా, సీతను పంచ్ కేటగిరిలో పెట్టి ఒక్కొక్కరికీ ఒక్కొక్క సలహా ఇచ్చాడు. అయితే నబీల్ గెలిస్తే తాను గెలిచినట్లే అని ఏమోషనల్ అయ్యాడు. ఇక నిఖిల్‌ను చూస్తే 30 ఏళ్ల క్రితం తనను తాను చూసుకున్నట్టు ఉందని అన్నాడు. పృథ్వి ఆట ఇప్పుడు తనకు చాలా నచ్చిందని ప్రశంసించాడు.
మరోవైపు ఆదివారం ఎలిమినేట్ అయ్యేది నైనిక అని తెలుస్తుంది. ఇప్పటికే డేంజర్ జోన్లో నైనికా, విష్ణుప్రియా ఉండగా.. నైనికను ఎలిమినేట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా దీనిపై నేటి ఎపిసోడ్లో క్లారిటీ వస్తుంది.