Appudo Ippudo Eppudo | కార్తికేయ, కార్తికేయ 2 సినిమాలతో పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్. ప్రస్తుతం ఈ కుర్ర హీరో స్వయంభు(Swayambhu)తో పాటు ది ఇండియా హౌస్ అనే సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో తాజాగా మరో సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు నిఖిల్. ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం అప్పుడో ఇప్పుడో ఎప్పుడో(Appudo Ippudo Eppudo). బొమ్మరిల్లు సినిమాలోని బ్లాక్ బస్టర్ పాట అయిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే పాటను టైటిల్‌గా తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమాకు స్వామిరారా దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. ఛత్రపతి, డార్లింగ్ లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ టాప్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రోడక్షన్స్పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీని దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఇక ఫస్ట్ లుక్ చూస్తే లవ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. కన్నడ చిత్రం సప్త సాగరాలు దాటి సినిమాతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు దక్కించుకున్న రుక్మిణి వసంత్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది.
Into the World of #AppudoIppudoEppudo ❤️
This’ll thrill you, tickle you & breeze you 🤗@actor_Nikhil @rukminitweets @divyanshak @harshachemudu @dvlns @BvsnP @SunnyMROfficial @singer_karthik @NavinNooli @SVCCofficial pic.twitter.com/elyKT8ESJC
— sudheer varma (@sudheerkvarma) October 6, 2024