BRS MLC Dasoju Sravan | హైదరాబాద్ : మహిళా రిజర్వేషన్‌ను వెంటనే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) అంశంపై ప్రస్తావిస్తూ.. భారత పార్లమెంటులో భారత శాసన వ్యవస్థలో మహిళా రిజర్వేషన్ అనేది చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్ అన్నారు.
ఈ దేశంలోని మనం నిజంగా ప్రతి ఒక్కరికీ సామాజిక న్యాయం అందించాలనుకుంటే, ముందుగా చేయాల్సింది మహిళా రిజర్వేషన్ అని.. దీనిని నియోజకవర్గాల పునర్విభజనతో ఎందుకు ముడిపెట్టాలి ..? అని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్‌ను వెంటనే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామన్నారు. చాలా పురోగతి సాధిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాల ప్రయోజనాలను భారత ప్రభుత్వం ఎలా కాపాడుతుందనే దానిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని.. బహిరంగ చర్చ జరగాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి రాసిన లేఖపై స్పందిస్తూ.. ఎప్పుడూ సామాజిక న్యాయం గురించి మాట్లాడే రాహుల్‌గాంధీ నుంచి రేవంత్ రెడ్డి ఆమోదం తీసుకున్నారేమోనని తనకు ఆశ్చర్యంగా ఉందన్నారు. జనాభా ఆధారిత పునర్వభజన నుంచి రాజధాని ఆధారిత పునర్విభజననను రేవంత్ రెడ్డి సూచించడం అసంబద్ధం, అహేతుకం. రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగ పీఠిక స్ఫూర్తికి విరుద్ధమన్నారు.
Mahabubabad | చెత్తను ఊడ్చి మున్సిపల్ కార్యాలయంలో పడేసిన ప్రజలు : వీడియో
రెండేళ్ల చిన్నారిని హతమార్చిన తండ్రి
Ashok Mittal | ఫెమా ఉల్లంఘన ఆరోపణలు.. ఆప్ ఎంపీ ఇల్లు, వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు