14 మంది సీఎంలపై తీవ్రమైన ఆరోపణలు
దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4,000కు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, 28 మంది ముఖ్యమంత్రుల్లో 14 మంది తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారని సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా సుప్రీంకోర్టుకు సోమవారం సమర్పించిన ఒక నివేదికలో తెలిపారు.
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌పై అత్యధిక కేసులు
- రెండో స్థానంలో సువేందు
- సుప్రీంకోర్టులో వెల్లడి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4,000కు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, 28 మంది ముఖ్యమంత్రుల్లో 14 మంది తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారని సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా సుప్రీంకోర్టుకు సోమవారం సమర్పించిన ఒక నివేదికలో తెలిపారు. భారత ప్రజా ప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో అమికస్ క్యూరీ (న్యాయస్థానపు స్నేహితుడు)గా విజయ్ హన్సారియా వ్యవహరిస్తున్నారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అత్యధికంగా 89 ఆరోపణలు/కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు ఉన్నారు. ఆయనపై 29 పెండింగ్ కేసులు ఉన్నాయి. లోక్‌సభలోని 543 మంది సభ్యుల్లో 251 మంది, రాజ్యసభలోని 233 మంది సభ్యుల్లో 75 మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు.
ఈ వ్యాజ్యాన్ని బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేశారు. ప్రస్తుతం పదవిలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాదాపు 4,192 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని నివేదిక వెల్లడించింది. 519 కేసులు దశాబ్దానికిపై పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. 700 కేసుల్లో ఇంకా విచారణ కూడా ప్రారంభం కాలేదని, పైగా వీటిలో 360 కేసులు చార్జిషీట్ కూడా దాఖలు కాకుండా మూడేళ్లకుపైగా ఇదే దశలో నిలిచిపోయాయని తేలింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరి రకాల మినీకిట్లపై రైతుల అభిప్రాయ సేకరణ
CM Vijay | తమిళనాడు సీఎం విజయ్‌కి మద్రాస్ హైకోర్టులో చుక్కెదురు..!
Oo Torture Prema | ఆకట్టుకునేలా ‘ఓ టార్చర్ ప్రేమ’ టీజర్.. డిసెంబర్ 11న గ్రాండ్ రిలీజ్!
‘చేనేత కార్మికులకు కూలీ రేట్ల పెంపు’
Arul Vignesh | మహిళా కలెక్టర్‌కు అసభ్య సందేశాల కేసు.. టీవీకే ఎమ్మెల్యే ఆరుళ్ విఘ్నేశ్ అరెస్ట్..!
ట్రెండింగ్ వార్తలు
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!

