NASA, astronaut Anil Menon | రోదసిలో పంట, వంట..! భారత సంతతి నాసా వ్యోమగామి ప్రయోగం
భారత సంతతి నాసా వ్యోమగామి అనిల్ మీనన్ అంతరిక్షంలో పండించిన తాజా ఆకుకూరలను కోసి వంట వండారు. భవిష్యత్ దీర్ఘకాలిక యాత్రలలో ఆహారాన్ని ఎలా ఉత్పత్తి చేయవచ్చో తన ప్రదర్శన ద్వారా తెలియజేశారు.
- భారత సంతతి నాసా వ్యోమగామి ప్రయోగం
న్యూఢిలీ: భారత సంతతి నాసా వ్యోమగామి అనిల్ మీనన్ అంతరిక్షంలో పండించిన తాజా ఆకుకూరలను కోసి వంట వండారు. భవిష్యత్ దీర్ఘకాలిక యాత్రలలో ఆహారాన్ని ఎలా ఉత్పత్తి చేయవచ్చో తన ప్రదర్శన ద్వారా తెలియజేశారు. ‘ఎక్స్’ వేదికగా పంచుకున్న వీడియోలో మీనన్, తోటి వ్యోమగామి జెస్సికా మెయర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోపల పండించిన కాలే(క్యాబేజీ తరహా), వసాబి(ఆవ జాతికి చెందిన) ఆకు కూరలను కోస్తూ, దానిని అంతరిక్ష భోజనంగా సిద్ధం చేశారు. అంతరిక్షంలో నానా పరిశోధనలలో భాగంగా ఈ కూరగాయలను దాదాపు నెల పాటు సాగుచేశారు.
ఇందుకు సహకరించిన నాసా వెజ్జీ బృందానికి ధన్యవాదాలు. మార్స్ గ్రహంపై ఆలూ పండించిన మార్స్ వాట్నీ(సినిమా పాత్ర) కూడా దీనిని చూసి గర్వపడతారు అని మీనన్ ఆ వీడియో పోస్టులో రాశారు. ఈ ప్రయోగం నాసాకు చెందిన వెజ్జీ ప్లాంట్ గ్రోత్ చాంబర్ లోపల జరిగింది. మొక్కలు సూక్ష్మ గురుత్వాకర్షణకు ఎలా స్పందిస్తాయో శాస్త్రవేత్తలు అర్థం చేసుకునేందుకు ఇది సహాయపడుతుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- astronaut Anil Menon
- India
- ISS
- NASA
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

