Ramp walk | టైలరింగ్‌లో శిక్షణ అంటూ.. ర్యాంప్ వాక్ చేయించారు.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంపై మాజీ మహిళా మావోయిస్టుల ఆరోపణ
రాయ్‌పూర్‌లో ఆగస్టు 7న నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో మాజీ మహిళా మావోయిస్టుల ర్యాంప్ వాక్ దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. దీనిని తమ విజయగాథగా, మహిళా సాధికారతగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజేపీ ప్రభుత్వం అభివర్ణించుకుంది.
- ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంపై మాజీ మహిళా మావోయిస్టుల ఆరోపణ
రాయ్‌పూర్, ఆగస్టు 18: రాయ్‌పూర్‌లో ఆగస్టు 7న నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో మాజీ మహిళా మావోయిస్టుల ర్యాంప్ వాక్ దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. దీనిని తమ విజయగాథగా, మహిళా సాధికారతగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజేపీ ప్రభుత్వం అభివర్ణించుకుంది. కానీ సుక్మాలోని పునరావాస కేంద్రంలో ఉంటున్న మాజీ మహిళా మావోయిస్టులు ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు. ర్యాంప్ వాక్‌లో తాము పాల్గొనటం స్వచ్ఛందంగా జరిగింది కాదంటున్నారు.
టైలరింగ్‌లో శిక్షణ ఇప్పిస్తామంటూ రాయ్‌పూర్ తీసుకుపోయారని, అక్కడికి వెళ్లాక ర్యాంప్ వాక్‌లో శిక్షణ ఇచ్చారని నలుగురు మాజీ మహిళా మావోయిస్టులు తాజాగా మీడియా ముందు వాపోయారు. ర్యాంప్ వాక్ గురించి తమకు ముందే తెలిసి ఉంటే, అక్కడికి వెళ్లేవాళ్లం కాదని అన్నారు. సుక్మా పునరావాస కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా పోలీసు అధికారి సీమా పోయం కూడా ఆ మహిళల ర్యాంప్ వాక్ గురించి తమకు ముందుగా ఏమీ తెలియదని అన్నారు. వారిని టైలరింగ్ తరగతుల కోసం తీసుకెళ్తున్నట్టు మాత్రమే తనకు సమాచారముందని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

