న్యూఢిల్లీ: సీనియర్ ఐఏఎస్ అధికారి మన్దీప్ కే భండారీని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) కొత్త చైర్‌పర్సన్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. భండారీ ప్రస్తుతం జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. గతంలో 2018లో ఆయన కేంద్ర మానవ వనరుల శాఖ ప్రైవేట్ కార్యదర్శిగా పనిచేశారు. ఆయన 2001 బ్యాచ్‌కు చెందిన ఏజీఎంయూటీ (అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరం, కేంద్రపాలిత ప్రాంతాలు) కేడర్ ఐఏఎస్ అధికారి. సీబీఎస్ఈలో కొత్త డిజిటల్ ఆన్-స్క్రీన్ మార్కింగ్(ఓఎస్ఎం) విధానంపై వివాదం తలెత్తిన కొన్ని నెలల తర్వాత భండారీ నియామకం జరిగింది. జూన్ 2న అప్పటి చైర్పర్సన్ రాహుల్ సింగ్, కార్యదర్శి హిమాంశు గుప్తాలను ప్రభుత్వం తొలగించింది.