బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అసెంబ్లీలో చేసిన ‘రెండు పెండ్లిళ్ల్ల’ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. గురువారం సాయంత్రం కరువు పరిస్థితులపై జరిగిన చర్చకు సమాధానం ఇస్తున్న సమయంలో శివకుమార్ బెంగళూరు నగర అభివృద్ధిపై మాట్లాడారు.
ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ ‘మీరు(ఎమ్మెల్యేలు) కూడా నగరానికి వచ్చి ఇక్కడి నుంచి వెళ్లడం లేదు. నగరానికి వచ్చిన వారిలో అందరికీ రెండు పెండ్లిళ్ల్లు జరిగాయి. అలాంటి వారు దాదాపు 12 మంది ఉన్నారు. వారి జాబితాను నేను ఇవ్వగలను’ అని అన్నారు. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎవరికీ గౌరవం తీసుకురాదని బీజేపీ ఎమ్మెల్యే సురేష్ కుమార్ అన్నారు.