రోమ్: ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచే బురఖాలు, నిఖాబ్లను పాఠశాలల్లో ధరించడంపై ఇటలీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ఆ దేశంలో ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించే వారికి వెయ్యి యూరోలు (సుమారు లక్ష రూపాయలు) జరిమానాగా విధిస్తారు. ఒక వేళ మైనర్ బురఖాను ధరిస్తే ఆ జరిమానాను ఆ విద్యార్థి తల్లిదండ్రులకు విధిస్తారు. అంతేకాకుండా ప్రతి తరగతి గదిలో విదేశీ విద్యార్థుల సంఖ్యను 30 శాతానికి మాత్రమే పరిమితం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తల, జట్టును మాత్రమే కప్పి ఉంచే హిజాబ్లపై ఎలాంటి నిషేధం లేదు. ఈ నిబంధనలను తాత్కాలిక చట్టం కింద అమలు చేస్తారు.