Harish Rao | తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చర్చల వివరాలు ప్రజల ముందు పెట్టాలని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. ముగ్గురు సీఎంల మీటింగ్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని బయట కూర్చోబెట్టారు. తెలంగాణ నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా బయట కూర్చోబెట్టే అంత సీక్రెట్ ఏముంది దాంట్లో.. ?మన తెలంగాణ ఇంజినీర్లు, మన ఈఎన్సీని కూడా లోపలికి ఎందుకు రానివ్వలే అని ప్రశ్నించారు.
మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన చర్చల వివరాలు ప్రజల ముందు పెట్టాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఇంజినీర్లను, నీళ్ల మంత్రిని బయటపెట్టి మీ ముగ్గురు సీక్రెట్‌గా గంట సేపు ఏం మాట్లాడుకున్నరో ఆ వివరాలేంటో తెలంగాణకు జరిగే ప్రయోజనం ఏంది..? తెలంగాణకు మన హక్కులు కాపాడేందుకు మీరు చేసిన కృషి ఏందో చెప్పాలని రాష్ట్ర ప్రజల పక్షాన మేం అడుగుతున్నామన్నారు. తెలంగాణకు ఆర్డీఎస్ ప్రాజెక్టుకు 15.9 టీఎంసీల నీళ్లు రావాలి కానీ రావడం లేదని హరీశ్ రావు అన్నారు. నువ్వు నిన్నటి మీటింగ్‌లో మాకు ఆర్డీఎస్ ప్రాజెక్టు ద్వారా 15.9 టీఎంసీల నీళ్లు రావాలని కేంద్ర మంత్రిని అడిగావా లేదా రేవంత్ రెడ్డి..? ప్రశ్నించారు.
తుంగభద్ర మీద కర్ణాటక కడుతున్న 3 బ్యారేజీల వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని వాటిని అడ్డుకోవడానికి ఏమైనా స్పష్టమైన హామీ పొందావా..? చెప్పాలన్నారు. తుంగభద్ర మీద బ్యారేజీలు కడుతున్నాం దీనికి మీరు ఎలాంటి అడ్డంకి చెప్పొద్దని కర్ణాటక అడిషనల్ చీఫ్ సెక్రటరీ మన ఇరిగేషన్ కార్యదర్శికి లేఖ రాస్తే దానికి మీరు ఏం సమాధానం ఇచ్చారు. ఈ బ్యారేజీలు స్టార్ట్ చేసి సంవత్సరం అవుతున్నా ఇంతవరకి తెలంగాణ ప్రభుత్వం ఆబ్జెక్షన్ కూడా చెప్పలేదన్నారు.
ముగ్గురు సీఎంల మీటింగులో ఉత్తమ్ కుమార్ రెడ్డిని బైట కూర్చోబెట్టారు
తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చర్చల వివరాలు ప్రజల ముందు పెట్టాలి
తెలంగాణ నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా బైట కూర్చోబెట్టే అంత సీక్రెట్ ఏముంది దాంట్లో
మన తెలంగాణ ఇంజనీర్లు,… https://t.co/LRxjPenMP8 pic.twitter.com/99BIb5U5s6
— Telugu Scribe (@TeluguScribe) June 27, 2026