RS Praveen Kumar | అప్పుడు ప్రకాశ్ రాజ్‌పై కేసు పెట్టారు.. ఇపుడు రేవంత్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టరు..? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar | రేవంత్ రెడ్డికి కొడంగల్‌లో కొండారెడ్డి పల్లిలో రెండు చోట్ల ఓటు ఉంది. TES0274035. ఇదే ఎపిక్ నెంబర్‌తో ఉంది. సీరియల్ నెం 974 కొడంగల్, సీరియల్ నెం 601 కొండారెడ్డి పల్లి. ముఖ్యమంత్రి హోదాలో వ్యక్తి రెండు ఓట్లు కలిగి ఉన్నారు. రేవంత్ రెడ్డి 31 సెక్షన్ ప్రకారం నేరస్థుడేనన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ .
RS Praveen Kumar | ప్రకాశ్ రాజ్ అనే సినీ నటుడు, చెన్నై, హైదరాబాద్‌లో ఓటు ఉందని 2019లో కేసు పెట్టారు. ఇపుడు రేవంత్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టరు..? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ప్రధాన ఎన్నికల అధికారి వెంటనే పోలీసు కేసు నమోదు చేయాలన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి కొడంగల్‌లో కొండారెడ్డి పల్లిలో రెండు చోట్ల ఓటు ఉంది. TES0274035. ఇదే ఎపిక్ నెంబర్‌తో ఉంది. సీరియల్ నెం 974 కొడంగల్, సీరియల్ నెం 601 కొండారెడ్డి పల్లి. ముఖ్యమంత్రి హోదాలో వ్యక్తి రెండు ఓట్లు కలిగి ఉన్నారు. రేవంత్ రెడ్డి 31 సెక్షన్ ప్రకారం నేరస్థుడేనన్నారు.
రేవంత్ రెడ్డి రెండు ఓట్ల గురించి తెలియకుండా, ఫేక్ అఫిడవిట్ ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేశారు. రేవంత్ రెడ్డి ఎన్నిక రద్దు చేయాలి. తప్పుడు సమాచారం ఇవ్వడం నేరం. రేవంత్ రెడ్డి పాలనలో సాఫ్ట్ వేర్ ఆధారంగానే నేరాలు. భూ భారతిలో కూడా ఇలాంటి నేరమే జరిగింది. ఎస్ఐఆర్ నిష్పక్షపాతంగా నడుపుతారని ఎలా నమ్మాలి సుదర్శన్ రెడ్డి..? రేవంత్ రెడ్డి చెప్తే ప్రధాన ఎన్నికల అధికారి బీఆర్ఎస్ ఓటు తొలగిస్తారనే అనుమానం ఉంది. బీఆర్ఎస్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి 2023 కొడంగల్ ఎన్నికల రద్దు చేయాలని కోరుతాం. కలెక్టర్ మీడియాను కూడా బెదిరిస్తున్నారు. తప్పుడు వార్తలు ప్రచురించద్దని బెదిరిస్తున్నారు. దీన్ని ఖండిస్తున్నాం. తెలంగాణలో బెదిరింపుల పాలన నడుస్తుంది. ప్రకాష్ రాజ్ కు ఒక న్యాయం, రేవంత్ రెడ్డికి ఒక న్యాయం ఉండద్దు. మీనాక్షి నటరాజన్ కు రేవంత్ రెడ్డి వేరు వేరు న్యాయం ఉండద్దు. కొడంగల్ ఎన్నిక రద్దు చేయాలని బిఆర్ఎస్ పోరాడుతుంది.
ప్రస్తుతం డెమోగ్రాఫికల్ సిమిలార్ ఎంట్రీ ఆధారంగా ఆటోమేటిక్‌గా రెండు ఓట్లు ఉంటే రద్దవుతాయి. కానీ ఇంతకుముందు మనమే ఫారం 7 లేదా ఫారం 8 ప్రకారం ఓటు మార్చుకోవాలి. ఫాక్ట్ చెక్ తెలంగాణపై కేసు నమోదు చేసి, ఆ సంస్థ గుర్తింపు రద్దు చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. మూటలు ఎయిర్ లైన్స్, రేవంత్ ఎయిర్ లైన్స్ లాంటి ప్రత్యేక ఎయిర్ లైన్స్ ఏర్పాటు చేసుకోవాలి. 700,800 కోట్ల బడ్జెట్ ఉండే సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో వేల కోట్ల అవినీతి అంటుంటే నవ్వొస్తుంది.
అపుడు ఎందుకు మాట్లాడలేదు..?
2014 నుండి 2023 వరకు గువ్వల బాలరాజు ఎమ్మెల్యే, 2024 లో ఎంపీ ఎన్నికల్లో ప్రవీణ్ కుమార్ ఇంద్రుడు చంద్రుడు అన్నడు.ఇపుడు బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడుతున్నారు.గువ్వల బాలరాజు, బండి సంజయ్, రేవంత్ రెడ్డి కలిసి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి 18 నెలలు సంక్షేమ మంత్రిగా పని చేశారు. అపుడు ఎందుకు మాట్లాడలేదు..?రేవంత్ రెడ్డి చేతిలో ఇంటలిజెన్స్ వ్యవస్థ ఉంది. లక్ష మంది పోలీసులున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ ఉంది. మీ దగ్గర ఉన్న అన్ని ఆధారాలు తీసుకొని, సంక్షేమ భవన్లో కూర్చుని 2028 వరకు కూర్చొని విచారణ చేయండి. మీకు ఏమైనా తెలియకపోతే నేనే వచ్చి వివరిస్తా..
రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ల మైత్రి గురించి మాట్లాడితే, భద్రత తొలగించాలని చూశారు. మా భార్యను ట్రాన్స్ఫర్ చేశారు. అయినా వినడం లేదని , గువ్వల బాలరాజుతో తప్పుడు వ్యాఖ్యలు చేపిస్తున్నారని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డికి కొండారెడ్డిపల్లిలో ఒకటి, కొడంగల్‌లో ఒకటి చొప్పున రెండు చోట్ల ఓట్లు ఉన్నాయి. మరి ఇది నేరమే కదా?
సెక్షన్ 17 ప్రకారం ఒకే వ్యక్తికి ఒకటికంటే ఎక్కువ ఓట్లు ఉండటానికి వీలు లేదు.
సెక్షన్ 17కి సంబంధించి ఎవరైనా తప్పుడు డిక్లరేషన్ ఇస్తే, ఆ వ్యక్తిపై సెక్షన్ 31 ప్రకారం… pic.twitter.com/YZ6ydsJqZB
— BRS Party (@BRSparty) July 15, 2026
Read Also :
Singireddy Niranjan Reddy | సీఎం పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకుల అరెస్టు అప్రజాస్వామికం : నిరంజన్ రెడ్డి
Pawan Kalyan | ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పవన్ కళ్యాణ్.. అన్నా లెజినోవా భావోద్వేగ పోస్ట్!
Nirmal | నిర్మల్‌లో కలకలం.. యువకుడిని దారుణంగా హత్యచేసిన దుండగులు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

