Harish Rao | కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో శ్రీశైలంలో మొదటి పథకం ఎల్లూరు పంప్ హౌజ్ ఉంటది.. ఎల్లూరు పంప్‌హౌస్‌లో 5 మోటార్లు ఉంటే నిన్న రాత్రి ఒక మోటార్ నడిచింది.. ఇప్పుడు రెండు మోటార్లు నడుస్తున్నాయన్నారు. మిగతా మూడు మోటార్లు ఎందుకు బంద్ పెట్టినవ్..? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. ఈ 5 మోటార్లలో ఒక్కొక్క మోటార్ 800 క్యూసెక్కుల నీళ్లు ఎత్తిపోస్తది.. 5 మోటార్లు నడిస్తే 4 వేల క్యూసెక్కులు ఎత్తిపోయాలే. కానీ రెండే మోటార్లు నడుస్తున్నయ్.. ఇంకా బాధ కలిగే అంశమేంటంటే ఆ రెండు మోటార్లు కూడా ఆన్ అండ్ ఆఫ్‌లో నడుస్తున్నాయి. పొద్దున 8 గంటలకు స్టార్ట్ అవుతయి.. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో బంద్ అయితయ్. యావరేజ్‌గా మోటార్లు 11 గంటలే నడుస్తున్నయ్. ఒక రోజు ఉదయాన్నే 7 గంటలకు స్టార్ అయి సాయంత్రం 8 గంటలకు పోతది. యావరేజ్‌గా ఆ రెండు మోటార్లు కూడా 11 గంటలు మాత్రమే నడుస్తున్నయ్. 5 మోటార్లు 24 గంటలు నడపాల్సింది పోయి 2 మోటార్లు కేవలం 11 గంటలే నడుపుతున్నారన్నారు హరీశ్ రావు
కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో మొత్తం ఎత్తగలిగే సామర్థ్యం 4000 క్యూసెక్కులు అయితే రేవంత్ రెడ్డి ఎత్తుతున్నది కేవలం 700 క్యూసెక్కులు.. ఇది పాలమూరు మీదున్న నీ ప్రేమ అంటూ ఎద్దేవా చేశారు. వెళ్దామంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తడా..? రేవంత్ రెడ్డి వస్తడా..? రమ్మనండి.. అంటూ హరీశ్ రావు సవాల్ విసిరారు.
ఎల్లూరు పంప్‌హౌస్‌లో 5 మోటార్లు ఉంటే నిన్న రాత్రి ఒక మోటార్ నడిచింది.. ఇప్పుడు రెండు మోటార్లు నడుస్తున్నాయి
మిగతా మూడు మోటార్లు ఎందుకు బంద్ పెట్టారు?
ఇంకా దారుణం ఏంటి అంటే ఆ రెండు మోటార్లు కూడా ఆన్ అండ్ ఆఫ్‌లో.. కేవలం 11 గంటలే నడుస్తున్నాయి
5 మోటార్లు 24 గంటలు నడపాల్సింది పోయి… pic.twitter.com/qGQPTP27C0
— Telugu Scribe (@TeluguScribe) September 10, 2026
KCR | కేసీఆర్ ఎందుకు రాజీనామా చేయాలి.. రేవంత్ రెడ్డినే రాజీనామా చేయాలి.. కాంగ్రెస్ వ్యూహం రివర్స్
Nitin Gadkari | హైవే పనులు ఆలస్యంపై సిగ్గుపడుతున్నా.. ప్రారంభోత్సవానికి నేను రాను: నితిన్ గడ్కరీ