G kishan reddy | పోక్సో కేసు నిందితుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ లొంగిపోయాడని ఓ వైపు.. పోలీసులు అరెస్ట్ చేశారని మరోవైపు కథనాలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. బండి సాయి భగీరథ్‌ను నేనే పోలీసులకు అప్పగించాను. ముందస్తు బెయిల్ విచారణ గురువారానికి వాయిదా పడడంతో, బండి సంజయ్ ఆదేశాల మేరకు బండి సాయి భగీరథ్‌ను నేనే సైబరాబాద్ పోలీసులకు అప్పగించానని బండి తరపు న్యాయవాది కరుణ సాగర్ ఇప్పటికే స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే సాయి భగీరథ్‌ను పోలీసులు అరెస్ట్ చేయలేదని.. బండి సంజయ్ ఆదేశాల మేరకు లొంగిపోయాడని కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. ప్రెస్ మీట్లో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు కిషన్ రెడ్డి బదులిస్తూ.. బండి సాయి భగీరథ్ సరెండర్ అయిపోయాడు కదా.. ఇంకా ఇష్యూ ఏముంది అని అన్నారు కిషన్ రెడ్డి. ఈ కామెంట్స్‌తో పోలీసుల వాదన వాస్తవం కాదని తేటతెల్లమైందనడంలో ఎలాంటి సందేహం లేదు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. స్టేట్ గవర్నమెంట్ పోలీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోలీస్ కానీ వ్యవస్థ కానీ వేరుగా ఉంటుంది. పశ్చిమ బెంగాల్లో మా అమిత్ షా విమానం దిగుతుంటే రాష్ట్ర పోలీసులు అనుమతి ఇవ్వలేదు. యూపీ సీఎం విమానం దిగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులు అనుమతివ్వకపోతే పక్కనున్నట్వంటి ఒడిశా రాష్ట్రంలో దిగి.. అక్కడి నుంచి రోడ్డు వెంట వెళ్లాల్సి వచ్చింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పోలీసులకు సంబంధించిన అంశం.. రాష్ట్ర పోలీసులకు పూర్తి అధికారం ఉంటుంది. దర్యాప్తు చేసి ఏ విషయమైనా చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. కేంద్రప్రభుత్వానికి ఇందులో ఏం ప్రమేయం ఉండదన్నారు.
బండి భగీరథ్ లొంగిపోయాడు కదా ఇంక ఇష్యూ ఏముంది
POCSO కేసు అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశం, అందులో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఉండదు
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి https://t.co/Rfha6wFN8b pic.twitter.com/ilUUoVqacE
— Telugu Scribe (@TeluguScribe) May 17, 2026