Jayam Ravi | జయం రవి వ్యాఖ్యలతో కోలీవుడ్‌లో కలకలం.. ‘మూడు అక్షరాల నటి’ ఎవరు?
Jayam Ravi | నటుడు జయం రవి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలపై నిర్వహించిన తాజా ప్రెస్ మీట్ కోలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది. భార్య ఆర్తీతో విడాకుల వ్యవహారానికి సంబంధించి మాట్లాడిన ఆయన, తన కుటుంబ సమస్యలకు కారణమంటూ ఒక నటి గురించి పరోక్ష వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Jayam Ravi | నటుడు జయం రవి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలపై నిర్వహించిన తాజా ప్రెస్ మీట్ కోలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది. భార్య ఆర్తీతో విడాకుల వ్యవహారానికి సంబంధించి మాట్లాడిన ఆయన, తన కుటుంబ సమస్యలకు కారణమంటూ ఒక నటి గురించి పరోక్ష వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రెస్ మీట్ సందర్భంగా జయం రవి ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావించలేదు. అయితే, “మూడు అక్షరాల పేరున్న ఒక నటి” అంటూ వ్యాఖ్యానించడంతో పాటు, ఆమెను పదేపదే “ఇడ్లీ నటి”గా పేర్కొనడం ఆసక్తిని పెంచింది. తన కుటుంబ జీవితంపై ఆ నటి ప్రభావం చూపిందని, తన గురించి మాట్లాడే నైతిక హక్కు ఆమెకు లేదని ఆయన వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియా వేదికలపై చర్చలు ఊపందుకున్నాయి. నెటిజన్లు, సినీ అభిమానులు పాత ఇంటర్వ్యూలు, పబ్లిక్ ఈవెంట్లు, వ్యక్తిగత సంబంధాలపై ఆధారపడి ఆ నటి ఎవరు అనే దానిపై ఊహాగానాలు మొదలుపెట్టారు. అయితే ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక స్పష్టత లేదు. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న చర్చల ప్రకారం, ఈ వైవాహిక వివాదంలో ఆర్తీకి అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక ప్రముఖ నటి గురించే జయం రవి సూచించి ఉండవచ్చని ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ధృవీకరణ లేకపోవడంతో, ఇవన్నీ ప్రస్తుతం ఊహాగానాలుగానే ఉన్నాయి.
ఇదే సమయంలో సింగర్, స్పిరిచువల్ హీలర్ కెనీషా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ కూడా మరింత చర్చకు కారణమైంది. జయం రవితో తన రిలేషన్‌షిప్‌కు ముగింపు పలుకుతున్నట్లు ఆమె పేర్కొనడం మరో మలుపు తీసుకొచ్చింది. ఆన్లైన్ ట్రోలింగ్, వ్యక్తిగత ఒత్తిళ్ల కారణంగా తాను సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించారు. ప్రెస్ మీట్లో జయం రవి భావోద్వేగానికి గురైనట్లు కనిపించారు. గత రెండేళ్లుగా తాను మౌనంగా ఉన్నానని, దాన్ని చాలామంది బలహీనతగా భావించారని ఆయన చెప్పారు. తన పిల్లలను కలిసే అవకాశాలు కూడా తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.ప్రస్తుతం ఈ వ్యవహారం తమిళ సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారి తీసింది. అయితే ఇందులో పలువురు వ్యక్తుల పేర్లు పరోక్షంగా ప్రస్తావనకు వస్తున్నప్పటికీ, ఎవరిపైనా అధికారిక ఆరోపణలు నిర్ధారించబడలేదు. దీంతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, ఊహాగానాలను జాగ్రత్తగా పరిగణించాలని సినీ వర్గాలు సూచిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్‌గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్‌బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
Adarsha Kutumbam | వెంకీ, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా.?
Harsha Chemudu | ట్రెండింగ్‌లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దర్శకుడికి ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన హర్ష చెముడు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

