KTR | పట్టపగలు తుపాకులతో తిరుగుతుంటే పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది : కేటీఆర్
KTR | కరీంనగర్లో పట్టపగలు ఐదుగురు దుండగులు తుపాకులతో తిరుగుతుంటే పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
KTR | పోలీసుల వాహనాల్లో డీజిల్ లేక ఆ వాహనాలను తోసుకుంటూ వెళ్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్ జ్యోతినగర్‌లోని పీఎంజే జ్యువెల్లరీలో ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఐదుగురు దుండగుల ముఠా దోపిడీకి పాల్పడిన ఘటనలో గాయపడ్డ వారు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్ప్రత్రిలో చికిత్స పొందుతుండగా.. కేటీఆర్ బీఆర్ఎస్ నేతలతో కలిసి పరామర్శించారు.
అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కరీంనగర్లో పట్టపగలు ఐదుగురు దుండగులు తుపాకులతో తిరుగుతుంటే పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందని ప్రశ్నించారు. మా కార్పొరేటర్లపై కేసులు, సోషల్ మీడియాలో మా పిల్లలు ఏదైనా పోస్టులు పెడితే ఫోన్ చేసి బెదిరించడం, ఒక రీట్వీట్ కొడితే 20 రోజులు జైల్లో పెట్టడం ఇదేనా పోలీసింగ్ అంటే.. ? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
రేవంత్ రెడ్డి అసమర్థత వల్ల శాంతిభద్రతల్లో తెలంగాణ ఈ రోజు బీహార్ స్థితితో పోటీ పడుతుందన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ పంట సాగులో పంజాబ్, హర్యానా రాష్ట్రాలను దాటి మొదటి స్థానంలో నిలిచింది. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణలో బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకంటే దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయని మండిపడ్డారు.
కరీంనగర్ పట్టణంలో ఉదయం 11 గంటలకు తుపాకులతో చొరబడి జ్యూవెలరీ షాపులో దొంగతనం చేశారు. ఈ ఘటన జరిగి ఇన్ని గంటలు గడుస్తున్నా నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు.
పోలీసుల వాహనాల్లో డీజిల్ లేక ఆ వాహనాలను తోసుకుంటూ వెళ్తున్నారు
కరీంనగర్ లో పట్టపగలు ఐదుగురు దుండగులు తుపాకులతో తిరుగుతుంటే పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది
మా కార్పొరేటర్లపై కేసులు, సోషల్ మీడియాలో మా పిల్లలు ఏదైనా పోస్టులు పెడితే ఫోన్ చేసి బెదిరించడం, ఒక రీట్వీట్ కొడితే 20 రోజులు… https://t.co/7aS3shj9dO pic.twitter.com/TKuTDIa52k
— Telugu Scribe (@TeluguScribe) May 4, 2026
కరీంనగర్లో PMJ జ్యువెలరీ షాపులో చోరీ సమయంలో జరిగిన కాల్పుల్లో గాయపడిన సిబ్బందిని ఆసుపత్రిలో పరామర్శించిన కేటీఆర్ https://t.co/5wdFJ4Zw9U pic.twitter.com/mHL9cAzYcB
— Telugu Scribe (@TeluguScribe) May 4, 2026
Read Also :
Trisha | త్రిష బర్త్ డే స్పెషల్.. పోస్టర్ విడుదల, అవనిగా మెప్పించనున్న చెన్నై చంద్రం
TN Election Results | తమిళనాడులో విజయ్ ప్రభంజనం.. బోసిపోయిన డీఎంకే కార్యాలయం..!
One Crore Donations | తిరుమల ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు అజ్ఞాత భక్తుడు రూ. కోటి విరాళం
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

