Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా ఫేజ్-3 రింగు మెయిన్ -1 పరిధిలోని ప్రశాసన్ నగర్ నుంచి అయ్యప్ప సోసైటీ వరకు ఉన్న 1200 ఎంఎం డయా పీఎస్సీ గ్రావిటీ మెయిన్ పైపులైన్‌కు పలు ప్రాంతాల్లో లీకేజీలు ఏర్పడ్డాయి. వీటిని అరికట్టేందుకు మరమ్మత్తు పనులు చేపడుతున్నట్లు జలమండలి అధికారులు ప్రకటించారు.
ఈ పనులు ఈ నెల 23వ తేదీ సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి మరుసటి రోజు మంగళవారం ఉదయం 6 గంటల వరకు పనులు జరగనున్నాయని పేర్కొన్నారు. ఈ 24 గంటల పాటు పలు రిజర్వాయర్ల పరిధిలో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని చెప్పారు. హకీంపేట, గోల్కొండ. టౌలిచౌకి, లంగర్‌హౌజ్, షేక్‌పేట, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, తట్టిఖానా, మాదాపూర్, కొండాపూర్, డోమెన్స్, గచ్చిబౌలి ప్రాంతాల ప్రజలు తాగునీటిని పొదుపుగా వాడుకోని అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
HYDRAA | విలీన గ్రామాలపై హైడ్రా పిడుగు.. 51 పంచాయతీలపై పెత్తనం చెలాయించనున్న హైడ్రా
RRR Alignment | సౌత్ అలైన్‌మెంట్‌పై సర్కారు కమిటీ మార్పు ఎందుకోసం? రైతుల్లో పలు సందేహాలు..!
Real Estate | ఇండ్ల అమ్మకాలు ఢమాల్! హైదరాబాద్‌లో 42 శాతం సేల్స్ డౌన్