HYDRAA | హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఓఆర్ఆర్ లోపలి విలీన గ్రామాలపై హైడ్రా పిడుగు పడనున్నది. ఔటర్ రింగ్ రోడ్డు లోపలి 51 గ్రామ పంచాయతీలు ఇటీవల గ్రేటర్లో విలీనమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం ఈ నెల 3వ తేదీన ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో హైడ్రాకు మంత్రి మండలి అపరిమిత అధికారాలు కట్టబెట్టింది. ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని మున్సిపాలిటీలు, విలీన గ్రామాల్లోని ప్రస్తుత అన్ని విభాగాలకు ఉన్న అధికారాలను హైడ్రాకు కట్టబెట్టింది. దీంతో ఇటీవలే రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని 51 గ్రామ పంచాయతీలపై హైడ్రా ఉక్కుపాదం మోపే అవకాశం ఉన్నదన్న ఆందోళనలు మొదలయ్యాయి.
చెరువుల రక్షణ పేరుతో ఇప్పటివరకు హైడ్రా జరిపిన కూల్చివేతలన్నీ దాదాపుగా మున్సిపాలిటీల పరిధిలోనే జరిగాయి. ఇకపై విలీన గ్రామ పంచాయతీల్లోనూ బుల్డోజర్లు కనిపిస్తాయన్న చర్చ మొదలైంది. ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న ‘విలీన’ నిర్ణయంతో ఆయా గ్రామాల ప్రజలు గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు హైడ్రాకు అప్పగించడంతో ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కుంటలు, చెరువుల చుట్టూ ఇండ్లు నిర్మించుకున్నవారు వణికిపోతున్నారు. హైడ్రా ఎప్పుడు వస్తుందో, తమ ఇల్లు ఎప్పుడు కూల్చుతుందో.. అని ఆందోళన చెందుతున్నారు. ఇన్నాళ్లూ ఏదైనా సమస్య ఉంటే స్థానికంగా ఉండే సర్పంచ్‌కు, పాలకవర్గానికి చెప్పుకునేవారిమని, ఇప్పుడు మున్సిపాలిటీల్లో విలీనంతో తమకు ప్రజాప్రతినిధులు దూరమయ్యారని వాపోతున్నారు. దీంతో స్థానిక సమస్యలు ఎవరికీ చెప్పుకోవాలో అర్థం కావడం లేదన్నారు. ఇప్పుడు హైడ్రా వస్తే తమ సమస్యలను ఎవరూ పట్టించుకుంటారని వారు వాపోతున్నారు.
ఇటీవల విలీనమైన గ్రామాల జాబితా ఇలా..
రంగారెడ్డి జిల్లా మున్సిపాలిటీ విలీనమైన గ్రామాలు
మేడ్చల్ జిల్లా మున్సిపాలిటీ విలీనమైన గ్రామాలు
సంగారెడ్డి జిల్లా మున్సిపాలిటీ విలీనమైన గ్రామాలు