Water Supply | హైదరాబాద్ : బోరబండ నుంచి లింగంపల్లి వరకు ఉన్న 800 డయా ఎంఎస్ పైపులైన్‌కు సఫ్దార్ నగర్ వద్ద లీకేజీ ఏర్పడింది. ఈ లీకేజీని అరికట్టడానికి ఈ నెల 22 (ఆదివారం)న ఉదయం ఆరు గంటల నుంచి మరుసటి రోజు 23 (సోమవారం) వరకు మరమ్మతు పనులు చేపడుతున్నట్లు జల మండలి అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ 24 గంటల పాటు పలు ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఈ సందర్భంగా చెప్పారు.
ఎస్పీఆర్ హిల్స్ సెక్షన్‌లోని జైవంత్ నగర్, సునీల్ నగర్, వీకర్స్ సెక్షన్, మహాత్మా నగర్, వినాయక్ నగర్, హబీబ్ ఫాతిమా నగర్ ఫేజ్-1, ఫేజ్-2, ఇంద్రనగర్, టి.అంజయ్య నగర్, బాబా సైలానీ నగర్, భరత్ నగర్, గాయత్రి నగర్, అల్లాపూర్, అజీజ్‌నగర్, శివ బస్తీ, మిరాజ్ నగర్, పద్మావతి నగర్, గాయత్రి నగర్, తులసి నగర్, వివేకానంద నగర్, పర్వత్‌నగర్, రామారావు నగర్, హరి నగర్, శివాజీ నగర్, ఆర్కే సోసైటీ, రాధాకృష్ణ నగర్, కేఎస్ నగర్, రాణా ప్రతాప్ నగర్, గణేశ్ నగర్ ప్రాంతాలలో నీటి సరఫరా ఉండదన్నారు. ఈ అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
Traffic Restrictions | ఎల్బీస్టేడియంలో క్రిస్మస్ వేడుకలు.. సాయంత్రం 5 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
GHMC | ఆ దారుల్లో చిమ్మచీకటి.. గ్రేటర్లో గాడి తప్పిన స్ట్రీట్‌లైట్ వ్యవస్థ
Hotels | స్టోర్ రూంలో ఎలుకలు.. గడువు ముగిసిన మసాలాలు