Traffic Restrictions | ఎల్బీస్టేడియంలో క్రిస్మస్ వేడుకలు.. సాయంత్రం 5 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
ఎల్బీ స్టేడియంలో శనివారం సాయంత్రం ప్రభుత్వం నిర్వహించనున్న క్రిస్మస్ వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు.
Traffic Restrictions | సిటీబ్యూరో, డిసెంబర్ 20(నమస్తే తెలంగాణ): ఎల్బీ స్టేడియంలో శనివారం సాయంత్రం ప్రభుత్వం నిర్వహించనున్న క్రిస్మస్ వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు, పరిసరాల్లో ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ ఎక్కువగా నగర ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ తెలిపారు.
ట్రాఫిక్ మళ్లింపు..
ఏఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వాహనాలకు అనుమతులుండవు. పంప్ వద్ద నుంచి నాంపల్లి రైల్వేస్టేషన్-రవీంద్రభారతి వైపు మళ్లిస్తారు. బషీర్‌బాగ్ నుంచి ఏఆర్ పెట్రోల్ పంపు వైపు వాహనాలకు అనుమతి లేదు. బీజేఆర్ విగ్రహం నుంచి ఎస్బీఐ, గన్‌ఫౌండ్రీ వైపు ఈ వాహనాలను మళ్లిస్తారు. సుజాత స్కూల్ లేన్ నుంచి ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను సుజాత స్కూల్ జంక్షన్ నుంచి నాంపల్లి వైపు మళ్లిస్తారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

