Vinod kumar | బీఆర్ఎస్ పార్టీకి వీరాభిమాని అయిన పార్టీ సీనియర్ కార్యకర్త తెలంగాణ సత్తెమ్మ మృతి చెందడం బాధాకరమని, సత్తెమ్మ మృతి పట్ల మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో, పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్న సత్తెమ్మ.. చివరికి ఆదివారం అంతిమ శ్వాస విడిచిందని వినోద్ కుమార్ బాధాతత్ప హృదయంతో విచారం వ్యక్తం చేశారు.
తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన సత్తెమ్మ.. ఆ గ్రామం మధ్య మానేరు రిజర్వాయర్‌లో ముంపుకు గురి కాగా సత్తెమ్మకు రగుడు గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇల్లు ఇచ్చి పార్టీ పరంగా అండగా నిలిచిన విషయాన్ని వినోద్ కుమార్ గుర్తు చేశారు. సత్తెమ్మ కుటుంబ సభ్యులకు వినోద్ కుమార్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Pahalgam attack | పహల్గాం దాడికి ఏడాది.. పాక్ తీవ్రవాదంపై అమెరికాలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన భారత్
Bike Rally | హిందూ సమ్మేళనం సందర్భంగా తాండూర్‌లో బైక్ ర్యాలీ
Watch: కలెక్టర్‌తో రైతుల సమావేశంలో కోతి.. తర్వాత ఏం జరిగిందంటే..?