KTR | పోక్సో కేసు నిందితుడు లొంగిపోయిండో.. అరెస్టయిండో ఆ డ్రామా నడుస్తున్నది కానీ.. మొత్తానికి ఆ అమ్మాయికి కొంత న్యాయం జరిగే పరిస్థితులు వచ్చాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గ ముఖ్య కార్తకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీని ఒక్కటే అడుగుతున్నా ఇవాళ మీరు బేటీ బచావో బేటీ పఢావో అంటున్నరు. కేవలం నినాదానికే పరిమితమైతే న్యాయం జరుగదు మోదీ గారు.. బౌద్ధ భారతదేశంలో మొట్టమొదటి సారి ఒక కేంద్రమంత్రి కొడుకు మీద లుకౌట్ నోటీసులు జారీ చేసే పరిస్థితి వచ్చింది. కేంద్ర మంత్రిని మీరు బర్తరఫ్ చేయకపోతే విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేనే లేదు. ఎందుకంటే ఆతప్పు చేసిన వ్యక్తిని దాచి పెట్టిందెవరు.. 9 రోజులు ఎవరు దాచిపెట్టిర్రు. ఆ కేంద్ర మంత్రే కదా.. ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగుతుండటం.. అది తెలంగాణకే కాదు.. భారతదేశానికి కూడా అవమానకరమన్నారు.
మైనర్ బాలికకు అన్యాయం చేసింది కేంద్రమంత్రి కొడుకైతే.. మైనర్ బాలిక తల్లిదండ్రులను భయబ్రాంతులకు గురి చేసింది స్వయంగా కేంద్రమంత్రి. ఆయననే పిలిచి బెదిరించి వాళ్ల (బాధిత కుటుంబాన్ని)ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఇంత తీవ్రమైన కేసును నీరు గారి పోయేలా చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. హనీట్రాప్ అని మీడియాను మనీట్రాప్లో వేసి.. మీడియాను గొంతు నొక్కివాళ్లను కూడా వార్తలు రాయనీయకుండా చేసింది ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి కలిసి. ఈ సమావేశం ద్వారా కేంద్రమంత్రిని బర్తరఫ్ చేయాలని మీ చప్పట్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మనం డిమాండ్ చేద్దామని.. లేకపోతే ఏ ఆడపిల్ల కూడా ధైర్యం చేయదని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
రేపు తన మీద ఏం జరిగినా.. ఏ అఘాయిత్యం జరిగినా ముందుకొచ్చే ధైర్యం చేయరు. పెద్దవాళ్లు తప్పించుకుంటరు.. అధికారంలో ఉన్నవాళ్లకు ఇబ్బంది కాదనుకుంటే ఏ ఆడకూతురు రేపు బయటకు వచ్చి ఫిర్యాదు చేయడానికి కూడా ముందుకు రాదన్నారు కేటీఆర్.
ప్రధానమంత్రి బేటీ బచావో.. బేటీ పఢావో అంటాడు.. కానీ పోక్సో కేసులో కేంద్ర మంత్రి కొడుకు మీద లుక్ అవుట్ నోటీసులు ఇచ్చే పరిస్థితి వచ్చింది
ఆ కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయకపోతే విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేనే లేదు.. ఆ తప్పు చేసిన కొడుకుని 9 రోజులు దాచి పెట్టింది ఆయనేగా
మైనర్… pic.twitter.com/7PtMDV5z7P
— Telugu Scribe (@TeluguScribe) May 17, 2026