Unemployees | చచ్చిపోతే నువ్వు సచ్చిపో.. రేవంత్ రెడ్డిపై నిరుద్యోగి ఫైర్.. వీడియో
Unemployees | చచ్చిపోతే నువ్వు సచ్చిపో .. నీకు ఎదిగొచ్చిన కొడుకుండి.. అతనికి ఉద్యోగం లేకపోతే ఆ బాధ నీకు తెలిసేది. నీకు కొడుకు లేడు కాబట్టి మాట్లాడుతున్నవ్. రేపు కనుక మా ఉద్యోగాలు పెంచి నోటిఫికేషన్ ఇవ్వకపోతే మీ కుర్చీ ఖాళీ చేయడం పక్కా అని రేవంత్ రెడ్డిని ఓ నిరుద్యోగి హెచ్చరించాడు.
Unemployees | దిల్సుఖ్నగర్లో నిరుద్యోగులు నోటిఫికేషన్లు విడుదల చేయాలని మరోసారి ఆందోళన బాట పట్టారు. నిరుద్యోగులను పురుగుల మందు తాగి చావమన్న సీఎం రేవంత్ రెడ్డిపై నిరుద్యోగులు కన్నెర్ర చేశారు. నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డి మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్తున్న నిరుద్యోగులను అడ్డుకున్న పోలీసులు వ్యాన్లలో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలించారు. నిరుద్యోగులు దండం పెట్టి కేసులు తీసుకోవాలని వేడుకున్నా పోలీసులు పట్టించుకోలేదు.
ఓ నిరుద్యోగి మాట్లాడుతూ.. మా మీద సోయి ఉందా మీకు అని ప్రశ్నించాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎంత సేపు దాచుకోవడం మీదనే శ్రద్ద ఉందని.. మీకు మా మీద సోయి లేదని మీడియా ముఖంగా హెచ్చరించారు. చచ్చిపోతే నువ్వు సచ్చిపో .. నీకు ఎదిగొచ్చిన కొడుకుండి.. అతనికి ఉద్యోగం లేకపోతే ఆ బాధ నీకు తెలిసేది. నీకు కొడుకు లేడు కాబట్టి మాట్లాడుతున్నవ్. రేపు కనుక మా ఉద్యోగాలు పెంచి నోటిఫికేషన్ ఇవ్వకపోతే మీ కుర్చీ ఖాళీ చేయడం పక్కా అని రేవంత్ రెడ్డిని హెచ్చరించాడు.
ఇలాంటి నిర్బంధ పాలన, దౌర్భార్య పాలన మేమెక్కడా చూడలేదు.. ఆరోజు రేవంత్ రెడ్డి నేను గడీలు పగులగొట్టిన, కంచెలు తీసేసిన అని మాట్లాడిన రేవంత్ ర్డెడ్డి.. ఏ నిరుద్యోగలతోనైతే అధికారంలోకి వచ్చాడో.. ఈ రోజు అదే నిరుద్యోగులను పోలీసుల ద్వారా హింసించడమనేది తీవ్రమైన హెచ్చరికగా మేము పరిగణనలోకి తీసుకుంటున్నామని మరో నిరుద్యోగి అన్నాడు.
రేవంత్ రెడ్డి మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్తున్న నిరుద్యోగులను అడ్డుకున్న పోలీసులు
నిరుద్యోగులను పురుగుల మందు తాగి చావమన్న రేవంత్ రెడ్డి.. భగ్గుమన్న నిరుద్యోగులు
హైదరాబాద్ – దిల్సుఖ్నగర్లో ఉద్రిక్తత
దండం పెట్టి కేసు తీసుకోవాలని వేడుకున్నా పట్టించుకోని… pic.twitter.com/fZOw4r52q5
— Telugu Scribe (@TeluguScribe) July 4, 2026
దిల్సుఖ్నగర్లో నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను అరెస్ట్ చేసిన పోలీసులు https://t.co/PKAEeHlMMu pic.twitter.com/Cm7RynGwPH
— Telugu Scribe (@TeluguScribe) July 4, 2026
Read Also :
CM Rekha Gupta: వర్క్ ఫ్రం హోమ్ ఎత్తివేస్తూ ఢిల్లీ సీఎం ఆదేశాలు
KTR | రేపు కన్నేపల్లి పంప్ హౌస్ను పరిశీలించనున్న కేటీఆర్
కొన్ని ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయి..
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

