CM Rekha Gupta: వర్క్ ఫ్రం హోమ్ ఎత్తివేస్తూ ఢిల్లీ సీఎం ఆదేశాలు
Chief Minister Rekha Gupta : వర్క్ ఫ్రం హోమ్ ఆదేశాలను ఢిల్లీ సర్కారు వెనక్కి తీసుకున్నది. ఇంధన కొరత నేపథ్యంలో మే నెలలో ఢిల్లీ ప్రభుత్వం.. ఉద్యోగులకు బుధ, శనివారాల్లో వర్క్ ఫ్రం హోం అమలు చేసిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: పశ్చిమాసియా ఉద్రికత్తల నేపథ్యంలో ఇంధన సరఫరా మందగించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మళ్లీ పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో.. ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. గతంలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రకటించిన వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు సీఎం రేఖా గుప్తా(CM Rekha Gupta) తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమె ఆదేశాలు జారీ చేశారు. ఆఫీసు పనివేళల్లో కూడా మార్పులు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు వారానికి రెండు సార్లు ఇంటి నుంచి పని చేయాలని మే నెలలో సీఎం రేఖా గుప్తా ఆదేశించారు. ఇంధనాన్ని ఆదా చేయాలని ప్రధాని మోదీ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఆ చర్యలు తీసుకున్నారు.
ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థాయికి వచ్చిందని, దీంతో వర్క్ ఫ్రమ్ హోం ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు సీఎం కార్యాలయం పేర్కొన్నది. బుధవారం, శనివారం రోజుల్లో వర్క్ ఫ్రం హోం కోసం ప్రభుత్వం గతంలో ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఆ నియమాన్ని ఎత్తివేసింది. ఇక ఆఫీసు వేళలను కూడా మార్చేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 వరకు పనిగంటలుగా ప్రకటించారు. గతంలో 10.30 నుంచి ఏడు గంటల వరకు ఉండేది. వర్క్ ఫ్రం హోం పాలసీ మార్పులకు చెందిన పూర్తి సమాచారం ఇంకా వెల్లడి కావాల్సి ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thummala Nageshwara Rao | యాసంగిలో వరి వేయొద్దు.. రైతులకు తుమ్మల నాగేశ్వరరావు సూచన
JNTU | మహబూబాబాద్ జేఎన్టీయూలో అక్రమాలు.. హాస్టల్ డిపాజిట్ పర్సనల్ ఖాతాలోకి!
సాగునీటి వెతలు.. కరెంటు కోతలు.. కరువు కోరలు.. పంట చేతికొచ్చేనా..?
Kodangal | సీఎం ఇలాకాలో బలవంతపు భూ సేకరణ.. మనస్తాపంతో రైతు ఆత్మహత్యాయత్నం
Insurance Scam | శవాల మీది పేలాల మేత.. కార్మిక శాఖలో 150 కోట్ల స్కామ్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

