బుద్ధింకలు!
అవి దేశ రాజధానిలో పారాడితే ఆసేతు హిమాచలం కళ్లప్పగించింది! పైలా పచ్చీసుగాళ్లే అంత అనుకుంటే కురువృద్ధులకు నిద్ర దూరం చేశారు!
అవి దేశ రాజధానిలో పారాడితే
ఆసేతు హిమాచలం కళ్లప్పగించింది!
పైలా పచ్చీసుగాళ్లే అంత అనుకుంటే
కురువృద్ధులకు నిద్ర దూరం చేశారు!
ప్రధాన మాధ్యమాలు కళ్లు మూసుకున్నా
దేశం కంటి ముందు సోషల్ మీడియా!
కట్టుబట్టలతో బయలుదేరిన బిడ్డలకు
అన్నీ ఉన్న చోటుకే దేశమే ఒక తైల్లెంది!
మేం వట్టి ఓటుమాతృలమే కాదు
వినకుంటే మీకు చేటుకాలమే అన్నరు!
విభజన రేఖలు చెరిపేస్తూ
సరిహద్దు భయాలు ఊదేస్తూ వందేమాతరం!
క్షమించడానికి ఏమీ లేనప్పుడు కూడా
పోనీలే అంటే గాయాలు వెక్కిరిస్తాయి!
ఎవడేలితే ఏముందంటూ తొలిసారి
డొల్లతనాన్ని ఆవిష్కరించిన వెలుగురేఖలు!
మేల్కొన్న తరమొకటి మనకు
భరోసా పత్రం లిఖించి ఇచ్చింది!
నూనూగు మీసాలో రెండు జడల సీతో
ఎదురొస్తే చాలు అన్ని జెండాలు సలాములే!
ఒకే ఒక దెబ్బ అందరూ సర్దుకుంటున్నరు
‘బుద్ధింకల’ భయం దేశానికి సూర్యోదయం!!
– కోట్ల వెంకటేశ్వర రెడ్డి
9440233261
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

