Ghatkesar | మేడ్చల్ మల్కాజ్గిరి : ఘట్కేసర్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో ఘనపూర్ వద్ద వేగంగా వెళ్తున్న ఓ కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న ఇద్దరు సజీవదహనం అయ్యారు. మంటల్లో చిక్కుకున్న వారు ఆ ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారు.
స్థానికులు, పోలీసులు కలిసి మంటలను ఆర్పేశారు. మృతదేహాలు మాంసపుముద్దలుగా మారాయి. మృతులను ఉప్పల్ వాసులుగా పోలీసులు గుర్తించారు. అయితే వీరు వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
Revanth Reddy | వారం రోజుల్లో ఉస్మానియా ఆస్పత్రికి శంకుస్థాపన : సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad | నడి రోడ్డుపై జీహెచ్ఎంసీ రోడ్ క్లీనింగ్ వాహనం బీభత్సం.. వీడియో
SRDP | ఆరాంఘర్ – జూపార్క్ ఫ్లై ఓవర్ ప్రారంభం.. ఎస్ఆర్డీపీ ఫలమిదీ..