Revanth Reddy | హైదరాబాద్ : గోషామహాల్ స్టేడియంలో వారం రోజుల్లో ఉస్మానియా ఆస్పత్రికి శంకుస్థాపన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆరాంఘర్ – జూపార్క్ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన సందర్భంగా రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
జూపార్క్ ఫ్లై ఓవర్‌కు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరును నామకరణం చేసినట్లు తెలిపారు. పాతబస్తీకి మెట్రో వచ్చి తీరుతుందని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ప్రధాని మోదీని కోరానని తెలిపారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేస్తామన్నారు. అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదన్నారు. పాతబస్తీ అభివృద్ధి విషయంలో ఎంఐఎంతో కలిసి పని చేస్తామని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డు విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లాను. రీజినల్ రింగ్ రోడ్డు వస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
రూ.799.74 కోట్లతో ఆరాంఘర్ నుంచి జూపార్క్ వరకు ఆరు లేన్లతో 119 పిల్లర్లతో 4.08 కిలోమీటర్ల మేర నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్, కర్నూల్, బెంగళూరు వైపునకు వెళ్లే ప్రయాణికులకు, వాహనదారులకు ట్రాఫిక్ నుంచి ఉపశమనం లభించినట్లైంది.
ఇవి కూడా చదవండి..
Hyderabad | నడి రోడ్డుపై జీహెచ్ఎంసీ రోడ్ క్లీనింగ్ వాహనం బీభత్సం.. వీడియో
SRDP | ఆరాంఘర్ – జూపార్క్ ఫ్లై ఓవర్ ప్రారంభం.. ఎస్ఆర్డీపీ ఫలమిదీ..
Osmania University | ఓయూలో ఆంధ్రా వ్యక్తులకు పెద్ద పీట.. భగ్గుమంటున్న విద్యార్థి సంఘాలు