SRDP | హైదరాబాద్ : వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఎస్ఆర్డీపీ కింద చేపట్టిన ఆరాంఘర్ – జూపార్క్ ఫ్లై ఓవర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో పాటు పలువురు ఎంఐఎం ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. పీవీ ఎక్స్‌ప్రెస్ వే తర్వాత నగరంలో రెండో అతిపెద్ద ఫ్లై ఓవర్ ఇదే.
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంలో భాగంగా గత కేసీఆర్ ప్రభుత్వం సిగ్నల్ రహిత ప్రయాణమే లక్ష్యంగా రూ.5937కోట్ల అంచనా వ్యయంతో జీహెచ్ఎంసీ 42 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. హెచ్ఎండీఏ, ఆర్ అండ్ బీ శాఖ ఐదు చోట్ల ఫ్లై ఓవర్లు చేపట్టింది. 42 ఫ్లై ఓవర్లలో 37 చోట్ల ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన అధికారులు.. రూ.799.74 కోట్లతో ఆరాంఘర్ నుంచి జూపార్క్ వరకు ఆరు లేన్లతో119 పిల్లర్లతో 4.08 కిలోమీటర్ల మేర చేపట్టి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. జూపార్కు ఫ్లై ఓవర్ 23వ ఫ్లై ఓవర్ కాగా, ఇప్పటికే 14 చోట్ల ఆర్వోబీ, ఆర్‌యూబీలు అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన ఐదు చోట్ల పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా ఎస్ఆర్డీపీ పూర్తి ఫలాలు అందుబాటులోకి తేస్తామని అధికారులు తెలిపారు.
– ఆరాంఘర్ నుంచి జూపార్క్ వరకు 4.08 కిలోమీటర్ల మేర అతి పొడవైన ఫ్లై ఓవర్
– ప్రాజెక్టు వ్యయం రూ. 799.74కోట్లు
– 280 మీటర్ల మేరలో రెండు ర్యాంపులు (ఆరాంఘర్ వైపు 184 మీటర్లు, జూపార్కు వైపు 95 మీటర్లు)
– ఆరు లేన్లతో ఇరువైపులా మూడు లేన్లతో నిర్మాణం.
– ఫ్లై ఓవర్ పొడవునా ఎల్ఈడీ లైటింగ్
– రాబోయే 20 ఏండ్ల ట్రాఫిక్ దృష్ట్యా ఫ్లై ఓవర్ నిర్మాణం.
ఇవి కూడా చదవండి..
HMPV | మళ్లీ కరోనా తరహా నిబంధనలు.. హెచ్ఎంపీవీ వ్యాప్తిపై ఐఎంఏ కీలక సూచన
Liquor bottles | హైదరాబాద్‌లో భారీగా అక్రమ మద్యం సీజ్..
Hyderabad | హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ దంపతులు ఆత్మహత్య