Hyderabad | హైదరాబాద్ : అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో విషాదం నెలకొంది. శ్రీరామ్ హిల్స్ కాలనీలో నివాసముంటున్న సాఫ్ట్వేర్ దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు శ్రీరామ్ హిల్స్ కాలనీకి చేరుకున్నారు. దంపతుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులను వరంగల్ జిల్లాకు చెందిన సందీప్(36), కీర్తి(30)గా పోలీసులు గుర్తించారు. వీరికి ఐదేండ్ల లోపు చిన్నారులు ఇద్దరు ఉన్నారు. దంపతుల ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇవి కూడా చదవండి..
Chhattisgarh | ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల దుశ్చర్య.. మందుపాతర పేలి ఏడుగురు జవాన్లు మృతి
HMPV | ఇప్పటికే భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా హెచ్ఎంపీవీ.. బాంబ్ పేల్చిన ఐసీఎంఆర్