HMPV | మళ్లీ కరోనా తరహా నిబంధనలు.. హెచ్ఎంపీవీ వ్యాప్తిపై ఐఎంఏ కీలక సూచన
HMPV | హెచ్ఎంపీవీ వైరస్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రజలకు కీలక విజ్ఞప్తి చేసింది. నమస్కారం ముద్దు - హ్యాండ్‌షేక్ వద్దు అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది.
HMPV | హైదరాబాద్ : హెచ్ఎంపీవీ వైరస్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రజలకు కీలక విజ్ఞప్తి చేసింది. ‘నమస్కారం ముద్దు – హ్యాండ్‌షేక్ వద్దు’ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. షేక్ హ్యాండ్స్ కారణంగా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపింది.
సీజనల్ వ్యాధులు తరుచుగా పిల్లలు, వృద్ధుల్లో అధికంగా వచ్చే అవకాశం ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రభు కుమార్ తెలిపారు. హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందితే శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. కాబట్టి వీలైనంత వరకు ఈ వైరస్ నివారణకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. వైరస్ సోకిన వారికి షేక్‌హ్యాండ్ ఇచ్చినా, తాకినా వైరస్ సోకవచ్చు. దగ్గు, తుమ్ముల నుంచి వచ్చే తుప్పిర్లు ద్వారా కూడా వైరస్ వ్యాపిస్తుందని తెలిపారు. ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చల్లని గాలులకు దూరంగా ఉండడంతో పాటు దూర ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిదని చెప్పారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
– ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలి.
– తరుచుగా సబ్బు లేదా శానిటైజర్‌తో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
– జన సమూహాలకు దూరంగా ఉండాలి.. భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి.
– రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహారం తీసుకోవాలి.
– వీలైనంత వరకు ఇంట్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
– జలువు, దగ్గు విపరీతంగా ఉంటే.. తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి.
ఇవి కూడా చదవండి..
HMPV | కర్ణాటకలో HMPV కేసులు.. అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం
HMPV | ఇప్పటికే భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా హెచ్ఎంపీవీ.. బాంబ్ పేల్చిన ఐసీఎంఆర్
HMPV | భారత్‌లో పెరుగుతున్న హెచ్‌ఎమ్‌పీవీ కేసులు.. అహ్మదాబాద్‌లో మరో చిన్నారికి వైరస్ పాజిటివ్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | రైతును కూలీగా మార్చిన కాంగ్రెస్.. యాదాద్రి జిల్లా కొండ్రెడ్డిచెరువులో దుస్థితి
Heavy Rains | మురసు ఎఫెక్ట్‌తో రెండ్రోజులు భారీ వర్షసూచన.. ఈ నెల 15నాటికి మరో తుపాను!
Conductor Pravalika | బస్సులో ‘చిల్లర’ వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడ్డ కండక్టర్ ప్రవళిక మృతి
Bigg Boss 10 | ముకేష్, వర్షిణిపై మాటల యుద్ధం.. దేబ్జానీ ఎమోషనల్.. శివ, త్రిగుణ్ ఫైర్!
Kollapur | ఫంక్షన్ హాల్లో బర్త్ డే సెలబ్రేషన్ వద్దు.. అమ్మ సమాధి దగ్గరే కేక్ కట్ చేస్తా.. ఆరేళ్ల బాలుడి నిర్ణయానికి కన్నీళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

