Liquor bottles | హైదరాబాద్ : హైదరాబాద్‌లో భారీగా అక్రమ మద్యం పట్టుబడింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు చెందిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గోవా నుంచి అక్రమంగా తీసుకొచ్చిన 82 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు పోలీసులు. మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
వాస్కోడిగామా – సికింద్రాబాద్ రైల్లో అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు తమకు పక్కా సమాచారం అందిందని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పేర్కొన్నారు. దీంతో ముందుగానే షాద్‌నగర్ రైల్వేస్టేషన్‌కు చేరుకుని.. అక్కడ్నుంచి సికింద్రాబాద్ చేరుకునే వరకు రైల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడ్డ మద్యం విలువ రూ. 22 లక్షలు ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad | హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ దంపతులు ఆత్మహత్య
Sheikh Hasina | షేక్ హసీనాపై బంగ్లా ఐటీసీ రెండో అరెస్ట్ వారెంట్.. అప్పటిలోగా హాజరు పర్చాలని ఆదేశం