Sheikh Hasina | బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్(ఐసీటీ) ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)పై మరోసారి అరెస్ట్ వారెంట్ (Arrest Warrant) జారీ చేసింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినందుకు గానూ ఆమెతో పాటు మరో 12 మందికి ఈ వారెంట్ జారీ చేసింది. హసీనా రక్షణ సలహాదారు మేజర్ జనరల్ (రిటైర్డ్) తారిక్ అహ్మద్ సిద్ధిఖీ, మాజీ ఐజీ బెనజీర్ అహ్మద్, మాజీ నేషనల్ టెలికమ్యూనికేషన్ మానిటరింగ్ సెంటర్ డీజీ జియావుల్ అహ్సాన్ వంటి వారు కూడా ఈ జాబితాలో ఉన్నారు. వీరందరినీ ఫిబ్రవరి 12వ తేదీలోపు కోర్టు ఎదుట ప్రవేశపెట్టాలని ఆదేశించింది. కాగా, హసీనా దేశం విడిచి భారత్కు వెళ్లిపోయిన నాటి నుంచి ఆమెపై జారీ అయిన రెండో వారెంట్ ఇది.
తొలి వారెంట్ గతేడాది అక్టోబర్ 17న జారీ అయిన విషయం తెలిసిందే. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినందుకు ఆమెతో పాటు మరో 45 మందిపై ట్రిబ్యునల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వారెంట్లు జారీ అయిన వారిలో హసీనా పార్టీ అవామీ లీగ్ అగ్ర నేతలు ఉన్నారు. వీరందరినీ నవంబర్ 18లోగా తమ ముందు హాజరు పరచాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. అయితే, ఆ ఆదేశాలు అమలు కాలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ఉధృతం కావడంతో ఆగస్టు 5న హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్కు పారిపోయి వచ్చిన సంగతి తెలిసిందే.
Also Read..
HMPV | భారత్లో పెరుగుతున్న హెచ్ఎమ్పీవీ కేసులు.. అహ్మదాబాద్లో మరో చిన్నారికి వైరస్ పాజిటివ్
Rhino | టూరిస్ట్ వెహికల్పై నుంచి ఖడ్గమృగం ముందు పడిపోయిన తల్లీ కూతురు.. తర్వాత ఏమైందంటే.. VIDEO